Stock Market: దాలాల్ స్ట్రీల్ లో కొనసాగుతున్న బుల్ జోరు.. లాభాల్లో ప్రధాన సూచీలు..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 406 పాయింట్లు పెరిగి 57,444 వద్ద, మరో కీలక సూచీ నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 17,250 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 160 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 290 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో జోరు కనిపిస్తోంది. నేడు ఒక్క మెటల్ సెక్టార్ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా రియట్లీ సెక్టార్ ఇండెక్స్ 1.28 శాతం మేర లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.17గా ఉంది. MCXలో 10గ్రాముల బంగారం ధర రూ.52,642గా ఉంది.
నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా 3.87%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.89%, ఏషియన్ పెయింట్స్ 1.89%, టీసీఎస్ 1.75%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.75%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.57%, సన్ ఫార్మా ఇండస్ట్రీస్ 1.49%, యస్ బ్యాంక్ 1.44%, ఎల్ అండ్ టీ 1.34%, ఇన్ఫోసిస్ 1.30% మేర లాభపడి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. గెయిల్ 2.14%, టాటా స్టీల్ 0.79%, బజాజ్ ఆటో 0.61%, హిందాల్కో ఇండస్ట్రీస్ 0.57%, ఓఎన్జీసీ 0.51%, సిప్లా 0.27%, యాక్సిస్ బ్యాంక్ 0.26%, భారతీ ఎయిర్ టెల్ 0.15%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.11% మేర నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
Gudur: కాలేజ్‌కి వెళ్తున్న కుమార్తె ఫ్రెండ్‌కి మాయమాటలు.. ఆపై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి