AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gudur: కాలేజ్‌కి వెళ్తున్న కుమార్తె ఫ్రెండ్‌కి మాయమాటలు.. ఆపై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి

చట్టాలు ఎన్ని వస్తున్నా.. కామాంధులు మారడం లేదు. తాజాగా కుమార్తె ఫ్రెండ్‌పైనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం సంచలనంగా మారింది.

Gudur: కాలేజ్‌కి వెళ్తున్న కుమార్తె ఫ్రెండ్‌కి మాయమాటలు.. ఆపై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి
representative image
Ram Naramaneni
|

Updated on: Apr 21, 2022 | 8:31 AM

Share

Tirupati district: చట్టాలు ఎన్ని వస్తున్నా.. కామాంధులు మారడం లేదు. తాజాగా కుమార్తె ఫ్రెండ్‌పైనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా గూడూరు రూరల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్‌ఐ తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు రూరల్‌ పరిధిలోని వేములపాళెం(Vemulapalem)లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతని కుమార్తె ఓ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీలో గూడూరుకు చెందిన మరో 16 ఏళ్ల బాలిక కూడా చదవుతుంది. వెంకటేశ్వర్లు కుమార్తెకు.. ఈ బాలిక ఫ్రెండ్. బుధవారం ఈ విద్యార్థిని కాలేజ్‌కు వెళ్లడం కాస్త లేటయ్యింది.  అప్పటికే తన కూతురును కాలేజీలో దిగబెట్టిన వెంకటేశ్వర్లు.. ఆ బాలిక రాకను గుర్తించి మాయమాటలు చెప్పాడు. అనంతరం రూరల్‌ ఏరియాలోని పారిచెర్ల వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఇంతలో అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కేకలు వేయడంతో వెంకటేశ్వర్లు పరారయ్యాడు. బాలిక అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనపై టూ టౌన్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. ఆ మేరకు బాలికను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతయ్య వెల్లడించారు.

Also Read: Viral: ఇంట్లో ఎవరూ లేరు వచ్చేమంది.. కింగ్‌లా అక్కడికి వెళ్లిన కుర్రాడికి దిమ్మతిరిగే షాక్..

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి