AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో పోటాపోటీ నిరసనలు.. ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..

ఢిల్లీలో ఇండియా కూటమి, బీజేపీ మధ్య పోటాపోటీ నిరసనలు హోరెత్తాయి. సీఈసీ రాజీనామా, ఎన్నికల సంస్కరణలకై ఇండియా కూటమి 'ఓట్ బచావో, దేశ్ బచావో' మెగా మార్చ్ నిర్వహించగా, 1984 సిక్కుల ఊచకోతకు వ్యతిరేకంగా బీజేపీ ప్రతి నిరసన చేపట్టింది. ఈ ర్యాలీలను జేపీ నడ్డా తీవ్రంగా విమర్శించారు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నారు.

ఢిల్లీలో పోటాపోటీ నిరసనలు.. ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..
India Bloc Delhi Rally
Shaik Madar Saheb
|

Updated on: Nov 01, 2026 | 1:43 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో పోటాపోటీ నిరసనలతో హోరెత్తుతోంది.. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి నేతృత్వంలో ఢిల్లీలోని మింట్‌ రోడ్ నుంచి రామ్‌లీలా మైదానం వరకూ భారీ మార్చ్‌ నిర్వహించనున్నాయి.. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు ఒకే వాహనంలో రామ్‌లీలా మైదానానికి బయలుదేరారు. విపక్షాల మెగా ర్యాలీ సందర్భంగా దిల్లీ పోలీసులు విస్తృత బందోబస్తు చేపట్టారు. వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఓట్‌ బచావో.. దేశ్ బచావో నినాదాలతో ఇండి కూటమి ఈ మెగా మార్చ్‌ నిర్వహిస్తోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది.. దీంతోపాటు 2023 ఎన్నికల కమిషన్ చట్టం రద్దు చేయాలని.. SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేసి.. తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలను నిర్వహించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇండియా కూటమి రామ్‌లీలా మైదనం వద్ద చేపట్టిన మార్చ్ కు భారీ సంఖ్యలో కాంగ్రెస్ సహా.. పలు పార్టీల నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొంటున్నారు.

అటు బీజేపీ నిరసన..

ఇండియా కూటమికి ధీటుగా బీజేపీ కూడా ఢిల్లీలో నిరసన చేపట్టింది. 1984 సిక్కుల ఊచకోతకు నిరసనగా బీజేపీ పాదయాత్ర చేపట్టింది. సిక్కుల ఊచకోత బాధితులకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో బీజేపీ నేతలతో పాటు సిక్కు సంఘాల ఆందోళన చేపట్టాయి. హరినగర్ బస్ డిపో నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన దారుణాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనకు భారీగా తరలివచ్చారు సిక్కు సంఘాల ప్రతినిధులు.. హర్యానాలో కూడా బీజేపీ చీఫ్ నితీన్ నబీన్ నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

విపక్షాలపై నడ్డా ఆగ్రహం..

ఇదిలాఉంటే.. ఇండియా కూటమి మెగా ర్యాలీపై కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అరాచకం సృష్టించే కుట్ర జరుగుతోందని, ఓడిపోయిన నేతలంతా రాజకీయ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ ర్యాలీ వెనుక నాలుగు కుట్రపూరిత లక్ష్యాలున్నాయంటూ నడ్డా విమర్శించారు. ఢిల్లీలో అల్లర్లు సృష్టించి ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యమని ఆరోపించారు. పండుగల వేళ ఢిల్లీ వ్యాపారుల ఆదాయాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమంటూ మండిపడ్డారు.

Follow Us