AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్.. ఒక్క సినిమాతో అతనెంటో తెలిసింది.. కానీ ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోవట్లేదు..

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కృష్ణవంశీ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో అంతగా యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ ఆయన రూపొందించిన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగులో నటించిన ఓ నటుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఒకప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్.. ఒక్క సినిమాతో అతనెంటో తెలిసింది.. కానీ ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోవట్లేదు..
Krishna Vamsi
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2026 | 1:36 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ దేశభక్తి చిత్రంగా నిలిచిన ‘ఖడ్గం’. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. అలాంటి ఈ మూవీ విడుదలై ఇరవై సంవత్సరాలు దాటినప్పటికీ, ఆ చిత్రానికి ఉండే క్రేజ్ ఎప్పటికీ తగ్గలేదు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర్య దినోత్సవం వేళ టీవీలలో ప్రసారమయ్యే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. ఇటీవలే ఈ సినిమాను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ మూవీ గురించి అలాగే ఇందులో ఉగ్రవాద స్లీపర్ సెల్ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించిన నటుడు షఫీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఖడ్గంలో విలన్ పాత్ర కోసం ఒక ప్రత్యేకమైన నటుడు కావాల్సి వచ్చిందని తెలిపారు. సమాజంలో అమాయక యువతను ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారు, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వారిని ఎలా వినియోగిస్తారనే అంశాన్ని ప్రతిబింబించే పాత్ర అది అని అన్నారు. కేవలం రొటీన్ విలన్‌లా కాకుండా, అమాయకత్వంతో పాటు భయంకరమైన వయొలెన్స్ చూపించగల సమర్థుడైన నటుడు ఆ పాత్రకు అవసరమని భావించామని తెలిపారు. అప్పట్లో షఫీ కృష్ణవంశీ వద్ద ‘చంద్రలేఖ’, హిందీ ‘అంతఃపురం’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

అలా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నేపథ్యం ఉన్న షఫీని ఆ పాత్రకు ఎంపిక చేశామని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. యాస, దక్కన్ హిందీ టచ్, తెలుగు మాట్లాడుతున్నప్పుడు కనిపించే ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో షఫీ ఆ పాత్రకు వంద శాతం ప్రాణం పోశారని అన్నారు. షఫీ మొదట్లో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారని తెలిపారు. అయితే, అంతటి గొప్ప నటి ప్రతిభ ఉన్న షఫీని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటికీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని, భవిష్యత్తులో సరైన సబ్జెక్ట్ దొరికితే ఆయనతో మళ్లీ పనిచేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని కృష్ణవంశీ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సౌండ్ సిస్టమ్‌తో ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసే అనుభవమే వేరని, అందుకే ఈ సినిమాను రీ-రిలీజ్ చేశామని ఆయన తెలిపారు. ఖడ్గం కేవలం ఒక సినిమా కాదని, అది ఒక ఎమోషన్ అని కృష్ణవంశీ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

షఫీ..

View this post on Instagram

A post shared by Shafi (@shafi_actor)

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us