AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు వివి వినాయక్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే కేవలం యాక్షన్ సినిమాలే కాకుండా అదుర్స్ వంటి కామెడీ ఎంటర్టైనర్ తోనూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా మిస్ కావడంపై స్పందించారు.

VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
Vv Vinayak
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2026 | 6:22 PM

Share

టాలీవుడ్ దర్శకుడు వి.వి.వినాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ సినీ ప్రస్థానం, వృత్తిపరమైన అనుభవాలు, వ్యక్తిత్వ లక్షణాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి అగ్ర హీరోలతో పనిచేసిన ఆయన, అక్కినేని నాగార్జునతో సినిమా చేయలేకపోవడంపై స్పందించారు. “అది ఒకటి, రెండు సార్లు అనుకున్నాం కానీ జరగలేదు సార్” అని వినాయక్ వివరించారు, దీనికి తన కమిట్‌మెంట్లే కారణమని పరోక్షంగా సూచించారు. వినాయక్ తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, తాను ఎవరినీ బాధపెట్టడం గానీ, కోపంగా మాట్లాడటం గానీ చేయలేదని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉన్నా తనలోనే దాచుకుంటానని, బయట వ్యక్తం చేయనని తెలిపారు. “కోపం వచ్చినా, ఏం వచ్చినా నేను ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకు సరే బాధ, చిన్న మాట అంటే బాధపడతారు కదండీ” అని ఆయన అన్నారు. ఇది తన గురువులు, స్నేహితులు, నిర్మాతల నుండి నేర్చుకున్న సహనం అని ఆయన వివరించారు. తనను, తన కుటుంబాన్ని చూసుకున్న సత్యనారాయణ రెడ్డి, గాంధీ, సాగర్, బుజ్జి, సురేశ్ వంటి వారితో తనకు బలమైన బంధం ఉందని, తన విజయం తన వారికి ఉపయోగపడాలనే భావన తనలో ఎప్పుడూ ఉంటుందని వినాయక్ పంచుకున్నారు. నిర్మాతలు తనను ఒక గాజు బొమ్మలా చూసుకున్నారని, ఏ దర్శకుడిని అలా చూసుకుని ఉండరని తెలిపారు. నో చెప్పడం తనకు అత్యంత కష్టమైన విషయమని అన్నారు.

దర్శకుడిగా తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన అదుర్స్ చిత్రం గురించి వినాయక్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమాలోని బ్రహ్మానందం పాత్ర టైమింగ్, సంభాషణలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఆయన అన్నారు. ఈ చిత్రానికి వచ్చిన ప్రశంసలలో ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే. విశ్వనాథ్ గారిని అభినందించడానికి వెళ్ళినప్పుడు, విశ్వనాథ్ గారు వినాయక్‌తో “ఏవయ్యా వినాయక్, రోజు నేను భోజనం చేసేటప్పుడు నీ అదుర్సే పెట్టుకుని చూస్తానయ్యా. ఎంత బాగా చేశారయ్యా వాళ్ళిద్దరూ?” అని అన్నారట. విశ్వనాథ్ గారి లాంటి గొప్ప దర్శకుడు తన సినిమాను ప్రతిరోజూ చూసి నవ్వుకోవడం తనకు దక్కిన అత్యంత గొప్ప అవార్డుగా భావించానని అన్నారు.

సినిమా నిర్మాణంలో సవాళ్లను వివరిస్తూ, 100% హిట్లు తీసిన దర్శకుడు ఎవరూ లేరని, ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది క్లిక్ అవ్వదో ఎవరికీ తెలియదని వినాయక్ అన్నారు. ఎడిటింగ్ రూమ్‌లో బాగుంది అనుకున్నది థియేటర్‌లో పేలకపోవచ్చని, థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన అంచనా వేయలేమని తరణ్ రామ్ జోషి గారి మాటలను గుర్తు చేసుకున్నారు. తన ప్రారంభ రోజుల్లో తనకు ఏ చెడు అలవాట్లు లేవని, సాయంత్రం అందరూ తన రూమ్‌కు వచ్చేవారని, అప్పట్లో తన ఇంటి యజమాని శ్యామ్ గారు ఎంతో సహకరించారని వినాయక్ గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Follow Us