AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సైక్లోన్‌ మురాసుగా బలపడిన వాయుగుండం.. ఈ పేరుకు అర్థం ఇదే

ఏపీకి మరో తుఫాన్ ముప్పు ఎదురైంది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం, ఈరోజు (01 నవంబర్ 2026) ఉదయం 11:30 గంటల IST సమయానికి తుఫానుగా బలపడింది.ఈ తుఫాన్‌కు మురాసు (Murasu)గా నామకరణం చేశారు అధికారులు. ఈ తుఫాన్‌కు మన ఇండియానే పేరు ఖరారు చేసింది. మురాసు అంటే యుద్ధ భేరి అని అర్థం అని అధికారులు పేర్కొన్నారు.

ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సైక్లోన్‌ మురాసుగా బలపడిన వాయుగుండం.. ఈ పేరుకు అర్థం ఇదే
Cyclone Murasu 2026
Anand T
|

Updated on: Nov 01, 2026 | 1:26 PM

Share

ఏపీ వైపు మరో తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తర్వాత వాయుగుండగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండగా బలపడి.. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం 11.30కి తుఫాన్‌గా బలపడింది. ఈ తుఫాన్‌కు మురసుగా నామకరణం చేశారు అధికారులు. గత అర్నబ్ తుఫాన్‌కు బంగ్లాదేశ్‌ నామకరణం చేయగా.. ఈ మురాసు తుఫాన్‌ను భారత్‌ నామకరణం చేసింది. మురాస్‌ అంటే పూర్తి అర్థం యుద్ధ భేరీ అని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం మురసు తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తుంది. గంటకు 20 కి.మీ వేగంతో కదులుతున్న ఈ తుఫాన్‌ సోమవారం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచానా వేశారు. ఇక మంగళవారం నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. అలాగే ఈ తుఫాన్ ప్రభావంతో తీరం ప్రాంతాల్లోని జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.

ఈ తుఫాన్ ప్రభావంతో ఇటు తెలంగాణలోను వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచానా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తో పాటు వనపర్తి జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us