AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంట్లో ఎవరూ లేరు వచ్చేమంది.. కింగ్‌లా అక్కడికి వెళ్లిన కుర్రాడికి దిమ్మతిరిగే షాక్..

పరిచయం పెరగడంతో ఫోన్ నెంబర్ ఇచ్చింది. హనీ లాంటి మాటలతో ఫిదా చేసింది. చాటింగ్‌లోనే రొమాన్స్ పీక్స్‌కి తీసుకెళ్లింది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరు. వచ్చేమంది.. యువకుడు ఆత్రంగా అక్కడికి వెళ్లగా..

Viral: ఇంట్లో ఎవరూ లేరు వచ్చేమంది.. కింగ్‌లా అక్కడికి వెళ్లిన కుర్రాడికి దిమ్మతిరిగే షాక్..
Cheating
Ram Naramaneni
|

Updated on: Apr 21, 2022 | 8:04 AM

Share

పరిచయం పెరగడంతో ఫోన్ నెంబర్ ఇచ్చింది. హనీ లాంటి మాటలతో ఫిదా చేసింది. చాటింగ్‌లోనే రొమాన్స్ పీక్స్‌కి తీసుకెళ్లింది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరు. వచ్చేమంది.. యువకుడు ఆత్రంగా అక్కడికి వెళ్లగా.. దిమ్మతిరిగే ఝలక్ తగిలింది. కేరళ తిరువనంతపురం అదిమలతురాలో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. 20 ఏళ్ల వయసున్న బాధితుడు.. ఓ మొబైల్‌ షాపులో వర్క్ చేస్తున్నాడు. పనుల నిమిత్తం ఓ అమ్మాయి అప్పుడప్పుడు ఆ షాపుకు వస్తుండేది. ఈ క్రమంలో ఆమెతో.. బాధితుడికి పరిచయం ఏర్పడింది. ఆపై మొబైల్ నెంబర్స్ ఎక్ఛేంజ్ చేసుకున్నారు. ఇంకేముంది.. వాట్సాప్‌లో అదే పనిగా చాటింగ్ షురూ చేశారు. మేటర్ చాలా దూరం వెళ్లింది.  ఈ క్రమంలోనే.. బాధితుడ్ని తన ఇంటికి ఆహ్వానించింది ఆమె. వీర లెవల్‌ సెంట్ కొట్టుకుని వెళ్లిన అతడికి.. ఊహించని షాక్ తగిలింది.  ఆమె భర్త.. ఆ యువకుడిని పట్టుకుని.. తాళ్లతో కట్టేశాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అమ్మాయిలా చాట్ చేసింది కూడా ఆమె భర్తే. దీంతో కుర్రాడు ఏం చేయాలో తెలీక కాళ్ల బేరానికి వచ్చాడు. వదిలిపెట్టాలని వేడుకున్నాడు. ఫైనల్‌గా.. లక్ష డబ్బు, కారు ఇస్తే వదిలేస్తామని.. ఆఫర్‌ ఇచ్చాడు ఆమె భర్త. అయితే తన దగ్గర 10 వేలు మాత్రమే ఉన్నాయని, మిగతా డబ్బు కోసం కజకుట్టమ్‌లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాలని కోరాడు ఆ కుర్రాడు.

దీంతో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి.. ఆ కుర్రాడి కారులో బయలుదేరారు. తీరా విలింజమ్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరికి కారు చేరుకోగానే.. సడన్‌ బ్రేక్‌ వేసి నేరుగా లోపలికి పరుగులు తీశాడు బాధితుడు. జరిగిందంతా లోపల చెప్పాడు. పోలీసులు బయటకు వచ్చేలోపు నిందితులంతా ఎస్కేప్ అయ్యారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం సెర్చింగ్ కొనసాగిస్తున్నారు.

Also Read: AP: లారీకి యాక్సిడెంట్.. గోనె సంచుల కట్టల మధ్యలో తెల్లటి సంచులు