Acharya: నాన్న ఆ మాటలంటూ హత్తుకోగానే నాకు కన్నీళ్లు ఆగలేదు.. ఆచార్య సినిమా అనుభవాలు పంచుకున్న చెర్రీ..
Ramcharan: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య (Acharya). చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan)ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.
Ramcharan: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య (Acharya). చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan)ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. పూజాహెగ్డే, కాజల్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. చిరు, రామ్ చరణ్ లు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ చిత్రంపై అంచనాలను పెంచుతున్నారు. అలా తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న చెర్రీ.. ఆచార్య సినిమా అనుభవాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రి చిరంజీవితో కలిసి నటించడం తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు.’ ఆచార్య షూటింగ్‌లో భాగంగా నాకు, నాన్నకు ఒక డబుల్ బెడ్రూం ను ఇచ్చారు. అక్కడ దాదాపు 20 రోజులు ఉన్నాం. నేను, డాడీ కలిసి నిద్రలేచేవాళ్లం. కలిసి భోజనం చేసేవాళ్లం. ప్రతిరోజు ఉదయం కలిసి వర్కవుట్స్ చేసే వాళ్లం. కలిసే షూటింగ్‌కు వెళ్లేవాళ్లం. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఒకే కార్‌లో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళ్లం. ఈ క్షణాలన్నీ నాకెంతో మధురమైనవి. ఈ సినిమాలో నాన్నతో ప్రయాణం గురించి నా ఫీలింగ్స్‌ను మాటల్లో చెప్పలేను’
అందుకే ఆచార్య నాకు స్పెషల్..
‘ఇదిలా సాగుతుండగా ఒక రోజు నాన్న మాట్లాడుతూ.. ‘ చరణ్ .. ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. ఆచార్య వల్ల మనకు కలిసి స్ర్కీన్‌షేర్ చేసుకునే అవకాశం దక్కింది. షూటింగ్‌కి ముందు లేదా తరువాత ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం. ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారీ కుదరదు అన్నాడు. అప్పుడు నాన్న నన్ను ఆప్యాయతతో హత్తుకున్నాడు. ఆ సమయంలో నాకు కన్నీళ్లు వచ్చాయి’ అని ఎమోషనల్ అయ్యాడు చరణ్. కాగా ధర్మస్థలి నేపథ్యానికి నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.
Yadadri: యాదాద్రిలో శివాలయ పునరుద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 25 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు