AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై గర్జిస్తున్న రష్యన్‌ క్షిపణులు.. మరియుపోల్‌లో ఇరు సేనల వీధి పోరాటాలు..

ఉక్రెయిన్‌ మీద రష్యన్‌ క్షిపణులు గర్జిస్తూనే ఉన్నాయి.. తూర్పు ప్రాంతంలో దూసుకుపోతున్న రష్యా మరియుపోల్‌ను ఉక్రెయిన్‌ సైన్యం ఖాళీ చేసేందుకు విధించిన గడుపును పొడిగించింది.. మరోవైపు కీవ్‌లో వేయికిపైగా పౌరుల మృత దేహాలు వెలుగు చూశాయి. 

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై గర్జిస్తున్న రష్యన్‌ క్షిపణులు.. మరియుపోల్‌లో ఇరు సేనల వీధి పోరాటాలు..
Russia Ukraine War
Sanjay Kasula
|

Updated on: Apr 20, 2022 | 10:12 PM

Share

యుద్ధం(Russia Ukraine War) మొదలు పెట్టి 57 రోజులు గడచిపోయింది.. కానీ చెప్పుకోదగ్గ విజాయాలేవీ లేక నష్టమే అధికంగా కనిపిస్తుడటంతో మరింతగా రెచ్చిపోతోంది పుతిన్‌ సేన.. ఉక్రెయిన్‌ నగరాల మీద మిసైల్స్‌ గుర్జిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతాన్ని టార్గెట్‌ చేస్తూ వైమానిక దాడులలతో హోరెత్తిస్తోంది రష్యా.. కీలకమైన పోర్ట్‌ సిటీ మరియుపోల్‌ ఇంకా తమ ఆధీనంలోకి రాకపోవడంతో మరింతగా రెచ్చిపోతోంది రష్యా.. అక్కడ ఇరు దళాలకు వీధిపోరాటాలు కొనసాగుతున్నాయి. మరియుపోల్‌లోని అజోవ్‌ప్థల్‌ స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న ఉక్రెయిన్‌ దళాలు లొంగిపోవడానికి ఇచ్చిన గడుపును పొడించింది రష్యా.. మరోవైపు నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రజలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పిలుపునిచ్చారు. రష్యా మిలటరీ ఎంత బలంగా ఉన్నా, తమ దళాలు వారిపై విరుచుపడుతునట్లు ఉక్రెయిన్‌ చాటుకుంటోంది. రష్యన్‌ ట్యాంకులు ఎక్కడ ఉన్నా, వాటిని గురిచూసి కొడుతున్నామనీ చెబుతోంది.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యన్‌ దళాల ముట్టడి కొనసాగుతోంది. నగరంలో 1,045 మృత దేహాలు బయట పడ్డాయి.. వీరతా తూటాల గాయలతో మరణించిన వారేనని అక్కడి అధికారులు చెబుతున్నాయి.. మృత దేహాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు.

మరోవైపు మరుభూమిగా మారిన బుచా సిటీలో రష్యా దాడుల్లో ధ్వంసమైన కార్లు, ఇతర వాహనాలన్నింటీని ఒకేచోట వేశారు.. యుద్ధంలో చనిపోయిన వారిని సామూహికంగా ఖననం చేసినట్లే కనిపిస్తున్నాయి ఈ వాహనాలు…

రష్యా చేస్తున్న దాడులతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌- చెర్నోబిల్‌ అణుప్లాంట్‌ను చూసి భయపడుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఈ ప్లాంట్‌ నుంచి రేడియేషన్‌ మళ్లీ విడుదల కావచ్చని అక్కడి జనం భయపడుతున్నారు.

రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటికి 50 లక్షల మంది వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ తెలిపింది. వీళ్లందరూ ఇప్పుడు పోలండ్‌, జర్మనీ వంటి పలు దేశాలతో ఆశ్రయం పొందుతున్నారు. యుద్ధం ఆగేలా కనిపించని పరిస్థితుల్లో- శరణార్థులుగా తమ జీవితం దుర్భరంగా ఉందని చెబుతున్నారు.

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధనేరాలను చరిత్ర మరిచిపోదని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు అయిన చార్లెస్‌ మైఖేల్‌- చెప్పారు. న్యాయం జరగకుండా శాంతి అసాధ్యం అన్నారాయన. ఉక్రెయిన్‌లోని బొరిడియాంకాలో ప్రజలను కలుసుకున్నారు చార్లెస్‌ మైఖేల్‌.. అక్కడి ప్రజలు మైఖేల్‌ను పట్టుకుని విలపించారు. తమ దీనస్థితిని ఆయనకు చెప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి: CM Jagan: సీనియర్లే ఇలా చేస్తే ఎలా.. మంత్రి కాకాని, అనిల్‌కు సీఎం జగన్‌ క్లాస్‌..

Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి