Kieron Pollard: కీరన్‌ పొలార్డ్‌ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు.. ఆందోళనలో ముంబై ఫ్యాన్స్‌..

Kieron Pollard Retirement: వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.

Kieron Pollard: కీరన్‌ పొలార్డ్‌ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు.. ఆందోళనలో ముంబై ఫ్యాన్స్‌..
Kieron Pollard
Follow us
Basha Shek

|

Updated on: Apr 21, 2022 | 12:30 AM

Kieron Pollard Retirement: వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు పొలార్డ్‌. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్, టీ20 లీగ్‌లు ఆడే విషయమై ఈ కరేబియన్‌ ఆల్‌రౌండర్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ముంబై ఇండియన్స్‌ (MI) ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా తన రిటైర్మెంట్‌పై ఒక వీడియో విడుదల చేసిన పొలార్డ్‌.. ‘నేను అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలామంది లాగే నేను 10 ఏళ్ల వయసు నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాను. వెస్టిండీస్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కల కన్నాను. అందుకు తగ్గట్టుగానే సుమారు 15 ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టు తరఫున ఆడాను. కరేబియన్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించినందుకు ఎంతో గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదలు తెలుపుతున్నాను. నా చిన్ననాటి హీరో బ్రియన్ లారా నాయకత్వంలో 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నా జీవితంలో ఇలాంటి ఎందరో దిగ్గజాలతో ఆడినందుకు నేనేంతో అదృష్టవంతుడిని ‘అని చెప్పుకొచ్చాడు.

ఫ్రాంఛైజీ క్రికెట్ పై నో క్లారిటీ..

కాగా ఇప్పటివరకు వెస్టిండీస్ జట్టుకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్ 2007లో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. కరేబియన్‌ జట్టు తరఫున 123 వన్డేలు,101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2,706 పరుగులతో పాటు 55 వికెట్లు తీశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 1,569 పరుగులతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌ జట్టు 2012 టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో పొలార్డ్‌ కూడా ఉన్నాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన విధ్వసంకర బ్యాటింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పటివరకు 184 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ఈ కరేబియన్‌ క్రికెటర్‌ 149.57 స్ట్రైక్‌ రేట్‌తో మొత్తం 3350 రన్స్‌ చేశాడు. ఇందులో 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 66 వికెట్లు తీశాడు.

Also Read:DC vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్‌ వార్నర్..

Maria Sharapova: తల్లి కాబోతున్న టెన్నిస్ తార మరియా షరపోవా.. నెట్టింట వైరలవుతోన్న బేబీ బంప్ ఫొటోలు

Two Wheeler Loan: బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..