Two Wheeler Loan: బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Two Wheeler Loan: ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునుకుంటున్నారా? అందులో బ్యాంకు లోన్ తీసుకుని కొందామని ప్లాన్ చేస్తున్నారా?

Two Wheeler Loan: బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
Bike Loan
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2022 | 9:16 PM

Two Wheeler Loan: ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునుకుంటున్నారా? అందులో బ్యాంకు లోన్ తీసుకుని కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ వార్త మీకోసమే. చాలా తక్కువ వడ్డీ రేట్లకే బైక్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు అనేక ఉన్నాయి. ఈ ద్రవ్యోల్బణ కాలంలో కూడా 10 శాతం కంటే తక్కువ వడ్డీని వసూలు చేస్తున్న బ్యాంకులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే బైక్ లోన్స్ ఇస్తున్నాయి. రూ. 1 లక్ష రుణానికి 3 సంవత్సరాల కాలానికి 6.85 శాతం చొప్పున వడ్డీ ఉంది.

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ద్విచక్ర వాహన కొనుగోలు దారులకు అతి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం చొప్పున ద్విచక్ర వాహన రుణాన్ని అందిస్తోంది. ఈ రేటు ప్రకారం.. లక్ష రూపాయల రుణం తీసుకుంటే రూ.3,081 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల కాలానికి ఈ లోన్ తీసుకోవచ్చు.

మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బైక్ లేదా మోటార్‌సైకిల్‌పై తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుతం తన కస్టమర్లకు 7.25% చొప్పున ద్విచక్ర వాహన రుణాలను అందిస్తోంది. ఈ రేటుతో మూడేళ్లపాటు రూ.3,099 EMI కట్టాల్సి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా బైక్ లోన్ ఇస్తోంది. 8.65% ప్రారంభ రేటుతో బైక్ లోన్‌ను అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. రుణం మొత్తంలో 0.50 శాతం లేదా రూ. 500 నుండి రూ. 1000 వరకు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సంవత్సరానికి 9.90 శాతం నుండి 10 శాతం వరకు వడ్డీ రేటుతో బైక్ రుణాలను అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షల వరకు రుణం కూడా తీసుకోవచ్చు. బ్యాంకు శాఖను సందర్శించిన తర్వాతే ప్రాసెసింగ్ రుసుము తెలుస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం సంవత్సరానికి 9 నుండి 28.30 శాతం చొప్పున బైక్ రుణాలను ఇస్తోంది. రూ. 25 వేల కంటే ఎక్కువ రుణం తీసుకోవచ్చు. లోన్ మొత్తంలో 2.5% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 16.25% నుండి 18% చొప్పున బైక్ లోన్ ఇస్తోంది. రూ.30,000 నుండి రూ.2.50 లక్షల వరకు బైక్ లోన్ తీసుకోవచ్చు. లోన్ మొత్తంలో 2% జీఎస్టీని ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు కోసం కనీసం రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ సాధారణ ద్విచక్ర వాహనాలు, సూపర్ బైక్‌లకు కూడా రుణాలను అందిస్తుంది. కనీస ఆదాయం రూ.12,500 ఉన్నవారు మాత్రమే స్టేట్ బ్యాంక్ బైక్ లోన్ తీసుకోవచ్చు. బైక్ లోన్ తిరిగి చెల్లించే వ్యవధి 3 సంవత్సరాలు.

HDFC బ్యాంక్ 14.50 శాతం ప్రారంభ రేటుతో బైక్ రుణాలను అందిస్తోంది. లోన్ మొత్తం గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి బ్యాంకు శాఖను సంప్రదించాలి. లోన్ మొత్తంలో 2.5% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. ఈ రుణం పొందాలంటే కనీస నెలవారీ ఆదాయం రూ. 10,000 ఉండాలి. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్ ఇందులో అందుబాటులో ఉంది.

Also read:

Astro Tips: బుధవారం రోజు ఇలా చేస్తే ఉద్యోగం, వ్యాపారంలో అద్భుత విజయం వరిస్తుంది..!

Viral Photo: 6 రోజుల్లో పెళ్లి.. 10 రూపాయల నోటుతో ప్రేయసి రాయబారం.. ఏం రాసిందో తెలిస్తే షాక్..!

Viral Video: కుక్కను ఓ రేంజ్‌లో కాకా పట్టిన పిల్లి.. దాని ట్యాలెంట్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..!