Viral Video: కుక్కను ఓ రేంజ్‌లో కాకా పట్టిన పిల్లి.. దాని ట్యాలెంట్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..!

Viral Video: కుక్క, పిల్లి గురించి అడిగితే ఎవరైనా ఏం చెబుతారు? టక్కున ఆ రెండూ ఆగర్భ శత్రువులు అనే చెబుతారు.

Viral Video: కుక్కను ఓ రేంజ్‌లో కాకా పట్టిన పిల్లి.. దాని ట్యాలెంట్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..!
Cat Vs Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2022 | 6:30 PM

Viral Video: కుక్క, పిల్లి గురించి అడిగితే ఎవరైనా ఏం చెబుతారు? టక్కున ఆ రెండూ ఆగర్భ శత్రువులు అనే చెబుతారు. శత్రువులు అయినప్పటికీ.. ఆ రెండింటినీ జనాలు ఎక్కువగా ఇష్టపడుతారు. ఇండియాలో ఎక్కువగా కుక్కలను మాత్రమే పెంచుకుంటారు. పిల్లులను చాలా తక్కువ. కానీ, విదేశాల్లో చాలా ఇళ్లల్లో కుక్కలు, పిల్లులను రెండింటినీ సాదుతారు. అయితే, సహజంగానే రెండూ శుత్రువులైన కుక్క, పిల్లి ఒకే ఇంట్లో ఉంటూ నానా రచ్చ చేస్తాయి. ఒకదానికొకటి ఘర్షణకు దిగుతాయి. ఫుడ్ విషయంలో గానీ, మరే విషయంలోనైనా సరే రెండూ ఒక్కచోట ఉన్నాయంటే అంతేసంగతులు అని చెప్పొచ్చు. తాజాగా ఓ కుక్క, పిల్లికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పిల్లి, కుక్క మధ్య జరిగిన సన్నివేశం నెటిజన్లు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో పిల్లి, కుక్క ఎదురెదురుగా నిల్చున్నాయి. రెండూ చాలా సీరియస్‌గా ఒకదానివైపు మరొకటి చూసుకున్నాయి. ఇంతలో పిల్లి తన ముందరి కాళ్లతో కుక్క ముఖంపై మసాజ్ చేయడం ప్రారంభించింది. కుక్క ముఖం, గడ్డంపై నిదానంగా నిమురుతూ మసాజ్ చేస్తుండగా.. ఆ కుక్క హాయిగా ఆస్వాదిస్తుంది. ఆ పిల్లిని చూస్తుంటే.. అదేమైనా మసాజ్ కోర్స్ చేసిందా? బ్యూటీపార్లర్‌లో ట్రైనింగ్ ఏమైనా తీసుకుందా? అనే సందేహం కలుగక మానదు. మొత్తానికి పిల్లి తన మసాజ్‌తో కుక్కను చాలా బాగా మేనేజ్ చేసేసింది. ఈ సన్నివేశాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 6.68 లక్షల మంది వీక్షించగా.. 56 వేల మందికిపైగా నెటిజన్లు లైక్ కొట్టారు. పిల్లి మసాజ్ బహు సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Also read:

Viral Video: డ్రైవర్ సాబ్ ఎంత పని చేశావయ్యా.. రిజర్వాయర్‌లో స్విమ్మింగ్ చేసిన కారు..!

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. రాబోయే మూడు రోజులు..

Andhra Pradesh: పూజారితో తన్నించుకునేందుకు బారులు తీరిన భక్తులు.. ఆ ఆలయ ప్రత్యేకతే వేరు..!