AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. రాబోయే మూడు రోజులు..

Andhra Pradesh Weather Report: సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు రాయలసీమ

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. రాబోయే మూడు రోజులు..
Ap Weather Alert
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2022 | 3:41 PM

Andhra Pradesh Weather Report: సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి ఉపరితల ఆవర్తనం వరకు మధ్య తమిళనాడు నుండి దక్షిణ తమిళనాడు తీరం మీదుగా కొనసాగుతున్నది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షణ కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర వాతావరణ నివేదికను విడుదల చేశారు.

Also read:

KGF Chapter 2: మనసులోని మాట బయటపెట్టిన రాకీభాయ్.. ఆ హీరోయిన్‏తో నటించాలని ఉందంటూ..

టీడీపీ నేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

IPL 2022: ముంబై జట్టులో చేరనున్న అన్‌సోల్డ్ బౌలర్.. జాతకం మార్చేస్తాడంటోన్న రోహిత్.. ఆయనెవరంటే?