IPL 2022: ముంబై జట్టులో చేరనున్న అన్‌సోల్డ్ బౌలర్.. జాతకం మార్చేస్తాడంటోన్న రోహిత్.. ఆయనెవరంటే?

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడింది. అన్నింటిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు 5 సార్లు టైటిల్ గెలుచుకుంది.

IPL 2022: ముంబై జట్టులో చేరనున్న అన్‌సోల్డ్ బౌలర్.. జాతకం మార్చేస్తాడంటోన్న రోహిత్.. ఆయనెవరంటే?
Dhawal Kulkarni
Follow us
Venkata Chari

|

Updated on: Apr 20, 2022 | 2:45 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (MI) జట్టు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలో ఓడిపోయింది. అత్యధికంగా 5 సార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్న ముంబై జట్టు.. 15వ సీజన్‌లోనూ తొలి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తోంది. కాగా, వెటరన్ ఫాస్ట్ బౌలర్ ధావల్ కులకర్ణిని రోహిత్ శర్మ(Rohit Sharma) డిమాండ్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. త్వరలో ఈ బౌలర్‌ను ముంబై జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.

మెగా వేలంలో కులకర్ణికి మొండిచేయి..

33 ఏళ్ల కులకర్ణి ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌లో హిందీ కామెంటరీ టీమ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సీజన్‌లో జరిగిన మెగా వేలంలో అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ధావల్ కులకర్ణి ముంబై నివాసి. ఇటువంటి పరిస్థితిలో, ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియంలలో ఎలా బౌలింగ్ చేయాలో అతనికి బాగా తెలుసు. కులకర్ణి ముంబయి జట్టులో చేరితే రోహిత్‌కు ఎంతో లాభం చేకూరుతుంది.

కులకర్ణి పేరిట 86 వికెట్లు..

కులకర్ణి ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు పడగొట్టాడు. అతను ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు. 2020 సీజన్‌లో కులకర్ణిని ముంబై జట్టు రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. దీని తరువాత, అతను 2021 సీజన్‌లో ముంబై జట్టులో కూడా భాగమయ్యాడు. అతను ముంబై తరపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ధావల్ కులకర్ణి టీమిండియా తరపున 12 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో వన్డేల్లో 19 వికెట్లు, టీ20ల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ఇటీవల ముంబై తరపున 3 రంజీ మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీశాడు.

ముంబై ఇండియన్స్ జట్టు:

రిటెన్షన్ జాబితా- రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు).

బ్యాట్స్‌మెన్స్/వికెట్ కీపర్లు- ఇషాన్ కిషన్ (రూ. 15.25 కోట్లు), డెవాల్డ్ బ్రెవిస్ (రూ. 3 కోట్లు), అన్మోల్‌ప్రీత్ సింగ్ (రూ. 20 లక్షలు), రాహుల్ బుద్ధి (రూ. 20 లక్షలు), ఆర్యన్ జుయల్ (రూ. 20 లక్షలు).

బౌలర్లు- బాసిల్ థంపి (రూ. 30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ. 1.60 కోట్లు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.30 కోట్లు), మయాంక్ మార్కండే (రూ. 65 లక్షలు), టైమల్ మిల్స్ (రూ. 1.50 కోట్లు), రిలే మెరెడిత్ (రూ. 1 కోటి).

ఆల్ రౌండర్లు – ఎన్ తిలక్ వర్మ (రూ. 1.70 కోట్లు), సంజయ్ యాదవ్ (రూ. 50 లక్షలు), జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు), డేనియల్ సామ్స్ (రూ. 2.6 కోట్లు), టిమ్ డేవిడ్ (రూ. 8.25 కోట్లు), మహ్మద్ అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు), రమణదీప్ సింగ్ (రూ. 20 లక్షలు) లక్షలు), హృతిక్ షోకీన్ (రూ. 20 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు), ఫాబియన్ అలెన్ (రూ. 75 లక్షలు).

స్క్వాడ్ బలం- 25 (17 మంది భారతీయులు, 8 మంది విదేశీయులు).

Also Read: IPL 2022: పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకొచ్చిన బెంగళూరు.. మిగతా జట్ల పరిస్థితేంటంటే..

IPL 2022: నిర్లక్ష్యానికి తోడు నీడలా దురదృష్టం.. ఐపీఎల్‌లో కోహ్లీ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన మాజీ క్రికెటర్‌..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!