IPL 2022: పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకొచ్చిన బెంగళూరు.. మిగతా జట్ల పరిస్థితేంటంటే..

IPL 2022 Points Table: ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. విజయం కోసం అన్ని జట్లు తుదివరకు పోరాడుతున్నాయి.

IPL 2022: పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకొచ్చిన బెంగళూరు.. మిగతా జట్ల పరిస్థితేంటంటే..
Royal Challengers Bangalore
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 20, 2022 | 9:58 AM

IPL 2022 Points Table: ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. విజయం కోసం అన్ని జట్లు తుదివరకు పోరాడుతున్నాయి. ఇక ప్రతి మ్యాచ్‌తో ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో సమీకరణాలు మారుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 19) జరిగిన హోరాహోరీ మ్యాచ్‌ (LSG vs RCB) లో బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. ఇప్పటివరకు టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీకి ఇది ఐదో గెలుపు. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు రెండో స్థానానికి దూసుకొచ్చింది. అగ్రస్థానం కోసం ఆజట్టు గుజరాత్‌ టైటాన్స్‌ తో పోటీపడుతోంది. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ ఖాతాలో కూడా 10 పాయింట్లు ఉన్నప్పటికీ ఆ జట్టు కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. అంతేగాక ఆ జట్టుకు మెరుగైన రన్‌రేట్‌ కూడా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన రాహుల్‌ సేన 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఇక మిగతా జట్ల విషయానికొస్తే.. రాజస్థాన్‌ రాయల్స్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) మూడో స్థానంలో కొనసాగుతోంది. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఐదో ప్లేస్‌లో ఉంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఆరో స్థానం, పంజాబ్‌ కింగ్స్‌ (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఏడో స్థానం, ఢిల్లీ క్యాపిటల్స్‌ (5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) ఎనిమిదో స్థానం, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (6 మ్యాచ్‌ల్లో ఒక గెలుపు) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాయి. విజయాల ఖాతా తెరవని ముంబై అట్టడుగు స్థానంలో ఉంది.

Also Read:LSG vs RCB IPL 2022: డుప్లెసిస్‌ మెరుపులు.. చెలరేగిన హేజిల్‌వుడ్.. బెంగళూరు చేతిలో లక్నోకు భంగపాటు..

‘అరబిక్ కుతు’ పాటకు దుమ్మురేపిన పీవీ సింధు..

RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..