LSG vs RCB IPL 2022: డుప్లెసిస్‌ మెరుపులు.. చెలరేగిన హేజిల్‌వుడ్.. బెంగళూరు చేతిలో లక్నోకు భంగపాటు..

LSG vs RCB IPL Match Result: IPL 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ (LSG vs RCB)లో

LSG vs RCB IPL 2022: డుప్లెసిస్‌ మెరుపులు.. చెలరేగిన హేజిల్‌వుడ్.. బెంగళూరు చేతిలో లక్నోకు భంగపాటు..
Royal Challengers Bangalore
Follow us
Basha Shek

|

Updated on: Apr 20, 2022 | 12:54 AM

LSG vs RCB IPL Match Result: IPL 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ (LSG vs RCB)లో ఆ జట్టు18 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (96) , ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ (25/4) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది ఐదో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది డుప్లెసిస్‌ సేన. అదే సమయంలో, ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడో ఓటమిని మూటగట్టకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్సీ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్న డుప్లెసిస్‌కు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం దక్కింది.

నిరాశపర్చిన టాపార్డర్‌..

కాగా 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ డికాక్‌ (3), మనీశ్‌ పాండే (6) త్వరత్వరగా ఔటయ్యారు. కెప్టెన్‌ రాహుల్‌(30) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే కృనాల్‌ పాండ్యా (42) కొన్ని మెరుపులు మెరిపించాడు. దీపక్‌ హుడా (13), ఆయుష్‌ బదోని (13) నిరాశపరిచడంతో లక్నో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరాజయం వైపు సాగింది. చివర్లో స్టోయినిస్‌ (24), హోల్డర్‌ కొన్ని భారీ షాట్లు ఆడినా అవి ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించాయి తప్ప జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. RCB ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టి లక్నోను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆజట్టు 8 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

డుప్లెసిస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌..

అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్‌ సాఫీగా సాగలేదు. అనూజ్‌ రావత్‌ (4), కోహ్లీ(0) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే డుప్లెసిస్‌, మ్యాక్స్‌ వెల్‌ (23) పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా కెప్టెన్సీతో ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న డుప్లెసిస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. చివర్లో షాబాజ్‌ అహ్మద్‌ (26) కూడా కొన్ని భారీ షాట్లు ఆడడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది.

Also read:‘అరబిక్ కుతు’ పాటకు దుమ్మురేపిన పీవీ సింధు..

Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా.? అయితే ఇలా మార్చుకోవచ్చు.. ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే..

Health Tips: పులియబెట్టిన ఆహారాలు తింటున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!