AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా.? అయితే ఇలా మార్చుకోవచ్చు.. ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే..

ఆధార్.. ఇప్పుడు ప్రతి భారతీయుడికి ఇదే ఆధారం... (Aadhaar) ప్రభుత్వ పని అయినా.. ప్రైవేట్ పని అయినా కావాలంటే ఆధార్ ఉండాల్సిందే.

Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా.? అయితే ఇలా మార్చుకోవచ్చు.. ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే..
Aadhaar
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2022 | 9:16 PM

Share

ఆధార్.. ఇప్పుడు ప్రతి భారతీయుడికి ఇదే ఆధారం… (Aadhaar) ప్రభుత్వ పని అయినా.. ప్రైవేట్ పని అయినా కావాలంటే ఆధార్ ఉండాల్సిందే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందాలన్నా… విద్య విషయంలోనూ ఆధార్ కార్డుకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. ఆధార్ నంబర్ ఎప్పటికీ మీ వెంట ఉండాల్సిందే. ఇప్పుడున్న అనేక ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డ్ తప్పనిసరి చేశారు అధికారులు. ఇక రేషన్ కార్డుకు సైతం ఆధార్ అనుసంధానం ఉండాల్సిందే. ఇక ప్రస్తుతం ఓటర్ ఐడీ కార్డును కూడా ఆధార్ కార్డులోత అనుసంధానం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. పింఛను, స్కాలర్ షిప్, బ్యాంకింగ్, భీమా, పన్ను విధింపు వంటి ఇతర పనులకు ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ పనులు సక్రమంగా జరగాలి అంటే ఆధార్ కార్డును అప్డేట్ చేయాలి. అంతేకాకుండా.. అందులో ఉన్న తప్పులను సరిదిద్ధుకోవాలన్నా.. తనిఖీ చేయాలన్నా.. మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి. ఆధార్‌లో రెండు రకాల డేటా నమోదవుతుంది. జనాభా, బయోమెట్రిక్. జనాభా డేటాలో మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా వయస్సు, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా, సంబంధాల స్థితి, సమాచారం ఉంటుంది. వీటిలో ఏదైనా మార్పు చేసుకోవాలంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలి.

బయోమెట్రిక్ డేటాలో ఐరిస్, వేలిముద్ర, ఫోటో ఉంటాయి. అయితే మీ ఆధార్ కార్డులో ఉన్న మీ బయోడేటా తప్పుగా ఉన్నా.. లేదా ఏవైనా మార్పులు చేయాలనుకుంటే.. ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సి ఉంటుంది.. కానీ ఆధార్ ను ఎప్పుడు అప్డేట్ చేయాలనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఇంతకీ ఆధార్ ఎప్పుడు అప్డేట్ చేయాలో తెలుసుకుందామా.

వివాహం తర్వాత.. ప్రతి మహిళ పేరు.. ఇంటి పేరు అనేవి వివాహం తర్వాత మారిపోతుంటాయి. దీంతో వారు ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. భర్త ఇంటిపేరును తమ ఇంటిపేరుగా మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే.. భర్త ఇంటి చిరునామా కూడా. ఉద్యోగరీత్యా భార్యభర్తలు ఇద్దరు వేరే ప్రదేశానికి వెళ్లినా.. అక్కడకు సంబంధించిన అడ్రస్ మార్చాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి.

సమాచారం తప్పుగా.. ఆధార్ కార్డు రెడీ చేస్తున్న సమయంలో కొన్ని సార్లు తప్పులు జరుగుతుంటాయి. అంటే పేరు, లింగం, ఇంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలా అనేక పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే పేరు, లింగం కంటే పుట్టినతేదీ తప్పుగా ఉంటే అది మరింత పెద్ద సమస్య. ముఖ్యంగా పుట్టిన సంవత్సరం తప్పుగా ఉంటే మీరు అనేక అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇందుకు ఆధార్ కార్డులో వెంటనే మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది.

బయోమెట్రిక్స్ లో ఎప్పుడు..ఎందుకు మార్పులు అవసరం… UIDAI ప్రకారం, ఒక బిడ్డకు 5 సంవత్సరాల వయస్సు వచ్చినట్లయితే వారికి సంబంధించిన మొత్తం బయోమెట్రిక్ సమాచారాన్ని నమోదు చేయాలి. UIDAI ఈ దశలో పిల్లల కోసం డీ-డూప్లికేషన్ చేస్తుంది. ఆధార్ నంబర్ ఉన్న తర్వాత బయోమెట్రిక్ వివరాలు ఎంటర్ చేయాలి. బిడ్డకు 15 సంవత్సరాలు నిండినప్పుడు వారి బయోమెట్రిక్స్ వివరాలన్నీ తప్పనిసరిగా ఆధార్‌లో నమోదు చేయాలి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయడం చేసి అప్డేట్ చేయడం మంచిది. కొన్నిసార్లు వేలిముద్రలు పనిచేయవు. దీంతో స్కానర్ పై గుర్తులు పడవు. దీంతో ఆధార్ ఉన్నా కానీ… ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి కార్డ్ హోల్డర్ బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేసుకోవాలి.

Also Read: RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..

Ram Charan: బీఎస్ఎఫ్ జవాన్లను కలిసిన రామ్ చరణ్.. ఆర్‏సీ 15 షూటింగ్ మధ్యలో ఇలా..

Kajal Aggarwal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ .. సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్..