Ram Charan: బీఎస్ఎఫ్ జవాన్లను కలిసిన రామ్ చరణ్.. ఆర్‏సీ 15 షూటింగ్ మధ్యలో ఇలా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే

Ram Charan: బీఎస్ఎఫ్ జవాన్లను కలిసిన రామ్ చరణ్.. ఆర్‏సీ 15 షూటింగ్ మధ్యలో ఇలా..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2022 | 7:40 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఇప్పుడు ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్‏లోని అమృత్ సర్‏లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో అమృతసర్‏ సమీపంలోని ఖాసా సరిహద్దులకు వెళ్లారు. అక్కడే విధులలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకున్నారు. వారితో ముచ్చటించడమే కాకుండా.. కలిసి భోజనం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చెర్రీ ఐఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడని, రాజకీయ వ్యవస్థకు.. ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశమని వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని సమాచారం. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఉత్తరాదిలో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇందులో తారక్ కొమురం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు.

Also Read: The Kashmir Files: ఓటీటీలోకి ది కాశ్మీర్ ఫైల్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్‏లో ఉపాసన సందడి.. చరణ్‏కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..

Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్డేట్.. చివరి దశలో షూటింగ్.. మాస్ సాంగ్‏తో ఫైనల్..