AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kashmir Files: ఓటీటీలోకి ది కాశ్మీర్ ఫైల్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు కొన్నిసార్లు సంచలన విజయం సాధించిన సందర్భాలున్నాయి. చిన్న సినిమాగా ప్రేక్షకుల

The Kashmir Files: ఓటీటీలోకి ది కాశ్మీర్ ఫైల్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
The Kashmir Files
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2022 | 4:46 PM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు కొన్నిసార్లు సంచలన విజయం సాధించిన సందర్భాలున్నాయి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాయి. ఇక భారీ బడ్జెట్‏తో న్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సెన్సెషన్ క్రియేట్ చేసింది ది కాశ్మీ్ర్ ఫైల్స్. 90స్‌లో జరిగిన కొన్ని అమానవీయ ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులు.. వాటి పర్యవసానాల నేపథ్యంలో తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్‌… సంచనల విజయం సాధించింది. 10 కోట్ల కన్నా తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా తెరకెక్కిన కాశ్మీర్ ఫైల్స్‌ (The Kashmir Files) .. తొలి వారంలోనే వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది.

డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రధాని మోదీ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఎదురుచూశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మేలో జీ5లో విడుదల కానుందట. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రలలో నటించగా.. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

Also Read: Upasana Konidela: గోల్డెన్ టెంపుల్‏లో ఉపాసన సందడి.. చరణ్‏కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..

Prabhas: ఓవైపు పాన్‌ ఇండియా చిత్రాలు.. అంతలోనే మారుతితో సినిమా, ప్రభాస్‌ అసలు ప్లాన్‌ ఏంటో తెలుసా.?

Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్డేట్.. చివరి దశలో షూటింగ్.. మాస్ సాంగ్‏తో ఫైనల్..