AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్..

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్..
Netflix
Ayyappa Mamidi
|

Updated on: Apr 20, 2022 | 12:00 PM

Share

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ షేర్ల విలువ నిన్న అమెరికాలో 26 శాతం మేర పడిపోయాయి. గడచిన పదేళ్ల కాలంలో ఇంత భారీగా కంపెనీ షేర్ నష్టపోవటం ఇదే తొలిసారి. జనవరి-మార్చి మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సబ్‌స్క్రైబర్ల(subscribers) సంఖ్య గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ చందాదారుల సంఖ్య ఏకంగా రెండు లక్షలు తగ్గి 22.16 కోట్లకు చేరింది. నెట్‌ఫ్లిక్స్‌ పెయిడ్ సర్వీస్(Paid service) ప్రారంభించాక ఇంత భారీగా సబ్‌స్క్రైబర్లను కోల్పోవటం ఇదే మెుదటి సారిగా తెలుస్తోంది. చందాదారుల సంఖ్య తగ్గడంతో నెట్‌ఫ్లిక్స్‌ లాభాలు 6% తగ్గి 1.6 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే ప్రమాదం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌-జూన్‌లో మరో 20 లక్షల మంది నెట్‌ఫ్లిక్స్‌ను వీడనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇదే జరిగితే కంపెనీ మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని స్వయంగా ప్రకటించటం గమనార్హం. వాస్తవానికి మార్చితో ముగిసిన క్వార్టర్ లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.5 మిలియన్ల మేర పెరగొచ్చని నెట్‌ఫ్లిక్స్‌ గతంలో అంచనా వేసింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

ఈ రోజు కూడా షేర్ పతనం కొనసాగవచ్చని నిపుణులు అంచనాలు చెబుతున్నాయి. ఇలా జరిగితే షేర్ విలువ సగానికి పడిపోయినట్లవుతుంది. నాలుగు నెలల కంటే తక్కువ సమయంలోనే ఈ కంపెనీలో ఇన్వెస్టర్ల విలువ 150 బిలియన్ డాలర్ల మేర ఆవిరైంది. ఈ పరిస్థితులు మరింత దిగజారకుండా అరికట్టేందుకు కంపెనీ రంగంలోకి దిగుతోంది. కస్టమర్ల సంఖ్య పడిపోకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా సబ్‌స్క్రైబర్లు తన అకౌంట్ ను ఇతరులకు షేర్ చేయకుండా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీనికి తోడు తక్కువ ధరలో ప్రకటనలతో కూడిన కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టే పెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది కల్లా ఈ మార్పులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ సీఈఓ రీడ్‌ హేస్టింగ్‌ తెలిపారు.

2011లో నెట్‌ఫ్లిక్స్‌ 8 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. అప్పట్లో స్ట్రీమింగ్‌కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రకటించడంతో సబ్‌స్క్రైబర్లు భారీగా తగ్గారు. ఫలితంగా సీఈఓ రీడ్‌ హేస్టింగ్‌ క్షమాపణలు కూడా చెప్పారు. కొవిడ్‌ సంక్షోభం నుంచి క్రమంగా పరిస్థితులు చక్కబడుతుండడంతో నెట్‌ఫ్లిక్స్‌ చూసే వారి సంఖ్య తగ్గింది. దీనికి తోడు రష్యాలో సేవలు నిలిపివేయటం కూడా మరో కారణంగా నిలిచింది. ప్రస్తుతం యాపిల్‌, వాల్ట్‌ డిస్నీతో పాటు మరిన్ని సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది ఉచితంగా తమ సేవల్ని వీక్షిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. ఈ కారణంగా కొత్త సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరగటం లేదంటూ వ్యాఖ్యానించింది. వీరి కోసం త్వరలోనే సరసమైన రేట్లతో ప్లాన్లను ప్రవేశ పెడతామని కంపెనీ చెబుతోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Radhakishan Damani: ఆ టాటా స్టాక్ పై కన్నేసిన డీమార్ట్ బాస్.. కంపెనీలో దమానీకి ఎంత వాటా ఉందంటే..

Sri Lanka: లంకేయుల దీనస్థితి.. ఆకలి అరుపులతో రోడ్డునపడ్డ మత్స్యకారులు.. కదిలిస్తున్న వీడియో