AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhakishan Damani: ఆ టాటా స్టాక్ పై కన్నేసిన డీమార్ట్ బాస్.. కంపెనీలో దమానీకి ఎంత వాటా ఉందంటే..

Radhakishan Damani: డీమార్ట్ గ్రాసరీస్ చైన్ సంస్థ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ టాటా కంపెనీకి చెందిన ఆ కంపెనీలో వాటాలు కన్నేశారు. ఆ కంపెనీ షేర్లు వరుసగా పెరుగుతోంది.

Radhakishan Damani: ఆ టాటా స్టాక్ పై కన్నేసిన డీమార్ట్ బాస్.. కంపెనీలో దమానీకి ఎంత వాటా ఉందంటే..
Radhakishan Damani
Ayyappa Mamidi
|

Updated on: Apr 20, 2022 | 11:17 AM

Share

Radhakishan Damani: టాటా గ్రూప్‌ స్టాక్‌ కు చెందిన ట్రెంట్‌ లిమిటెడ్‌ స్టాక్‌ (Trent Limited) ఈ రోజు కూడా పుంజుకుంది. ఇంట్రాడేలో, ఈ షేరు2.21 శాతం పెరిగి రూ.1276 వద్ద టేడ్ అవుతోంది. ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు సంవత్సర కాలంలో 73 శాతం రాబడిని అందించింది. అదే సమయంలో, 2022లో ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు 20 శాతం రిటర్న్స్ ఇచ్చింది. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కూడా స్టాక్‌కు BUY రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ట్రెంట్ లిమిటెడ్ కంపెనీ ప్రముఖ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీకి (Radhakishan Damani) ఇష్టమైన షేర్. ఆయన గత కొన్ని త్రైమాసికాలుగా ఈ షేర్ హోల్డ్ చేస్తున్నారు. మార్చి 2022 నాలుగవ త్రైమాసికానికి సంబంధించిన షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం.. రాధాకిషన్ దమానీ కంపెనీలో 54,21,131 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీలో 1.5 శాతం వాటాకు సమానం. గత క్వార్టర్ లో కూడా రాధాకిషన్ దమానీ తన వాటాలో ఎటువంటి మార్పు చేయలేదు.

ఈ టాటా గ్రూప్ షేర్ ఐదేళ్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ తో తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చింది. ఈ కాలంలో షేర్ రేటు 373 శాతం పెరింగింది. 21 ఏప్రిల్ 2017 నాటికి షేర్ ధర రూ. 263.80 గా ప్రస్తుతం దాని విలువ రూ.1,276కి చేరింది. బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై BUY రేటింగ్ కొనసాగిస్తోంది. కంపెనీ పనితీరు బాగుంది. స్టోర్ల ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉంది. కంపెనీ రానున్న 3- 5 సంవత్సరాలలో కాలంలో బలమైన వృద్ధిని సాధిస్తుందని రీసెర్చ్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ.. వస్త్రాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచేందుకు చర్చలు జరుగుతున్నందున ఆ ప్రభావం కంపెనీపై ఉంటుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ప్రైస్ సెన్సిటివ్ రిటైల్ సెగ్మెంట్ డిమాండ్‌పై ప్రభావం చూపవచ్చు. ముడిసరుకు ధరలు కూడా పెరగడం కాడా ఆందోళన కలిగిస్తోంది. ట్రెంట్ ఆధ్వర్యంలో వెస్ట్‌సైడ్, జూడియో, జరా జెవి, జెవి పేర్లతో వేర్వేరు స్టోర్లను టాటా గ్రూప్ నడుపుతోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Stock Market: మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్.. జోరుమీదున్న పవర్, ఆటో, ఆయిల్&గ్యాస్ షేర్లు..

Sri Lanka: లంకేయుల దీనస్థితి.. ఆకలి అరుపులతో రోడ్డునపడ్డ మత్స్యకారులు.. కదిలిస్తున్న వీడియో