AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka: లంకేయుల దీనస్థితి.. ఆకలి అరుపులతో రోడ్డునపడ్డ మత్స్యకారులు.. కదిలిస్తున్న వీడియో

Sri Lanka: లంకేయుల దీనస్థితి.. ఆకలి అరుపులతో రోడ్డునపడ్డ మత్స్యకారులు.. కదిలిస్తున్న వీడియో

Anil kumar poka
|

Updated on: Apr 20, 2022 | 8:53 AM

Share

ఒకవైపు ఆకలి కేకలు -మరోవైపు ఆర్తనాదాలు. తిందామంటే తిండి దొరకదు - కొందామంటే డబ్బు సరిపోదు. కిలో చికెన్‌ 2వేలు, కేజీ ఉల్లిపాయలు ఐదు వందలు. కనీసం గుడ్డు తిందామంటే ఒక్కోటి 50 రూపాయలపైనే.


ఒకవైపు ఆకలి కేకలు -మరోవైపు ఆర్తనాదాలు. తిందామంటే తిండి దొరకదు – కొందామంటే డబ్బు సరిపోదు. కిలో చికెన్‌ 2వేలు, కేజీ ఉల్లిపాయలు ఐదు వందలు. కనీసం గుడ్డు తిందామంటే ఒక్కోటి 50 రూపాయలపైనే. పెట్రోల్‌, డీజిల్‌… ఇలా ఏదీ కొనలేని దుర్భర పరిస్థితి. ఇంకోవైపు విద్యుత్‌ సంక్షోభంతో దేశమంతటా చీకట్లు. ఇదీ శ్రీలంకలో కొన్నాళ్లుగా కనిపిస్తోన్న సీన్‌.శ్రీలంక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. లంక ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. అధికధరలను అదుపు చేయడంలో విఫలమైన దేశ అధ్యక్షుడు రాజపక్సే తప్పంతా ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన నివాసం దగ్గర జరిగిన అల్లర్ల వెనుక తీవ్రవాదుల హస్తముందని ఆరోపించారు. తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. అల్లర్ల వెనుక ఉన్న తీవ్రవాద గ్రూపులను గుర్తించినట్టు రాజపక్సే తెలిపారు. మరో ఆర్ధికసంక్షోభం నుంచి గట్టెక్కించాలని శ్రీలంక ప్రభుత్వం IMFను వేడుకుంది. శ్రీలంక అభ్యర్ధనను పరిశీలిస్తున్నామని IMF తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కించాలని భారత్‌తో పాటు చైనా ప్రభుత్వాలను కూడా వేడుకున్నారు అధ్యక్షుడు రాజపక్సే.

మరిన్ని చూడండి ఇక్కడ:

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..