Stock Market: మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్.. జోరుమీదున్న పవర్, ఆటో, ఆయిల్&గ్యాస్ షేర్లు..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కీలక సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ సూచీ 540 పాయింట్ల లాభంలో ఉంది.

Stock Market: మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్.. జోరుమీదున్న పవర్, ఆటో, ఆయిల్&గ్యాస్ షేర్లు..
Stock Market
Follow us

|

Updated on: Apr 20, 2022 | 10:21 AM

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కీలక సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ సూచీ 540 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 160 పాయింట్ల పాజిటివ్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిప్టీ స్వల్పంగా 50 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. మిడ్ క్యాప్ నిఫ్టీ 380 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. సెన్సెక్స్ సూచీ పెరుగుదలకు ప్రధానంగా పవర్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కారణంగా నిలిచాయి. గత రెండు రోజుల వరుస నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. నిఫ్టీ కీలక మద్దతుస్థాయిలను బ్రేక్‌ చేస్తుండడంతో అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. నిన్న అమెరికా మార్కెట్లు సానుకూలంగానే ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఐఎంఎఫ్‌ భారత వృద్ధిరేటును ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 9 శాతం నుంచి 8.2 శాతానికి కుదించింది. మరో పక్క కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బాండ్ల ఈల్డ్స్ పెరుగుదల ఇన్వెస్టర్లకు కీలకంగా మారాయి.

ఐచర్ మోటార్స్ 4.45%, లుపిన్ 3.05%, టాటా మోటార్స్ 2.81%, మారుతీ సుజుకీ 2.80%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.77%, హెచ్పీసీఎల్ 2.66%, ఐఓసీ 2.65%, డాక్టర్ రెడ్డీస్ 2.65%, బీపీసీఎల్ 2.33%, హీరో మోటొకార్ప్ 2.21% పెరిగి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. గెయిల్ 2.62%, ఎల్ అండ్ టీ 1.43%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.14%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.65%, ఓఎన్జీసీ 0.65%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.36%, యాక్సిస్ బ్యాంక్ 0.19%, వేగాంతా లిమిటెడ్ 0.18% నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Sri Lanka: లంకేయుల దీనస్థితి.. ఆకలి అరుపులతో రోడ్డునపడ్డ మత్స్యకారులు.. కదిలిస్తున్న వీడియో

Mutual Funds: బ్యాంకింగ్‌, PSU డెట్ ఫండ్స్ ఎలా పని చేస్తాయో తెలుసుకోండి..

Latest Articles