7th Pay Commission: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 8వ పే కమిషన్‌లో కొత్త ఫార్ములాతో జీతం పెరుగుదల?

రానున్న రోజుల్లో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం. 8వ పే కమిషన్‌లో వేతనాన్ని పెంచేందుకు కొత్త ఫార్ములా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

7th Pay Commission: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 8వ పే కమిషన్‌లో కొత్త ఫార్ములాతో జీతం పెరుగుదల?
Money Earning
Follow us

|

Updated on: Apr 20, 2022 | 9:46 AM

7th Pay Commission Latest News: రానున్న రోజుల్లో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు మరో శుభవార్త అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం. 8వ పే కమిషన్‌లో వేతనాన్ని పెంచేందుకు కొత్త ఫార్ములా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నుండి జీతం పెరగడమే కాకుండా, కొత్త ఫార్ములాను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 8వ పే కమీషన్ కోసం కొత్త ఫార్ములా 2024 తర్వాత అమలు చేయనున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పుడు కార్మికులు కొత్త ఫార్ములా నుండి ఉపశమనం పొందవచ్చు.

7వ వేతన సంఘం సిఫార్సులను ప్రభుత్వం 2016లో అమలు చేసింది. ప్రతి సంవత్సరం జీవన వ్యయం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, ప్రతి సంవత్సరం జీతం పెంచడం ఉత్తమ ఎంపికగా నిపుణులు భావిస్తున్నారు. 8వ వేతన సంఘంలోని కొత్త ఫార్ములాతో కేంద్ర ఉద్యోగుల జీతం ప్రతి సంవత్సరం నిర్ణయించనున్నారు. అయితే, దీనిని ప్రభుత్వం ధృవీకరించలేదు.

కొత్త ఫార్ములా ఏమిటి? కేంద్ర ఉద్యోగుల జీతం పెంపునకు Aykroyd ఫార్ములా పరిగణంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి ఈ డియర్‌నెస్ అలవెన్స్‌ని సవరిస్తారు. కానీ, బేసిక్ జీతం మాత్రం పెరగడం లేదు. కొత్త ఫార్ములాతో, ఉద్యోగుల జీతం ద్రవ్యోల్బణం రేటు, జీవన వ్యయం మరియు ఉద్యోగి పనితీరుతో ముడిపడి ఉంటుంది. వీటన్నింటిని బేరీజు వేసుకున్న తర్వాత ఏటా జీతం పెంచుతారు.

కొత్త ఫార్ములా ఎందుకు అవసరం? అన్ని కేటగిరీల ఉద్యోగులకు సమాన ప్రయోజనాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం గ్రేడ్-పే ప్రకారం ప్రతి ఒక్కరి జీతంలో చాలా వ్యత్యాసం ఉంది. కొత్త ఫార్ములాతో ఈ గ్యాప్‌ని తగ్గించే ప్రయత్నం జరగొచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో 14 పే గ్రేడ్‌లు ఉన్నాయి. కేంద్ర ఉద్యోగుల జీవన స్థితిగతులను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం. కొత్త ఫార్ములా సూచన మంచిదే, కానీ ఇప్పటి వరకు అలాంటి ఫార్ములా ఏదీ చర్చించలేదు. 8వ వేతన సంఘంలో ఏమి జరుగుతుందో చెప్పడానికి ఇది చాలా తొందరగా ఉంది.

ఆహారం, ద్రవ్యోల్బణం ప్రకారం జీతం పెరుగుదల నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే జీతంలో పెరుగుదల చాలా తక్కువ. 7వ వేతన సంఘం సిఫార్సుల సమయంలో, జస్టిస్ మాథుర్ కీలక సూచనలు చేశారు. కొత్త ఫార్ములా (Aykroyd ఫార్ములా) వైపు వేతన నిర్మాణాన్ని తరలించాలనుకుంటున్నామని సూచించారు. ఇందులో జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని జీతం నిర్ణయిస్తారు. Aykroyd సూత్రాన్ని రచయిత వాలెస్ రుడెల్ అక్రాయిడ్ అందించారు. సామాన్యులకు తిండి, బట్టలు అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also…  Solar Eclipse of 2022: ఈ నెలలో ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం.. గ్రహణ కాలంలో చేయకూడని పనులు ఏమిటంటే..