ఇండియాలో కుప్పకూలిన ఎయిర్‌లైన్స్ వ్యవస్ధ – అస్తవ్యస్తంగా మారిన ఎయిర్‌పోర్టులు
ఇండిగో సంక్షోభం కంటిన్యూ అవుతూనే ఉంది...! DGCA రూల్‌బుక్ సవరించినా, కేంద్ర సర్కార్ సీన్‌లోకి ఎంటరైనా, ఇండిగోస గోసగానే ఉంది. ఎయిర్‌పోర్టు పరిసరాలన్నీ కుంభమేళాను తలపిస్తున్నాయి. ఇక టెర్మినల్స్ లోపల గడబిడ గందరగోళం అలాగే ఉంది. ఇండిగో కౌంటర్ల దగ్గర అదే హైటెన్షన్. ప్యాసింజర్లలో అంతులేని హైరానా. ఇక ఇంతా జరుగుతుంటే 850 విమానాలే రద్దు చేశామని చావుకబురు చల్లగా చెప్పడంతో ఓవైపు ఆగ్రహం కట్టలు తెంచుకుంటే... మరోవైపు అంతులేని ఆవేదన వ్యక్తమవుతోంది.

ఇండిగో విమానాల రద్దుతో ప్యాసింజర్స్‌కి ట్రాజెడీ సినిమా కనిపిస్తోంది. ఐదురోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో కౌంటర్స్ దగ్గర గందరగోళం నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ముందస్తు సమాచారం ఎక్కడంటూ ఆక్రోశం కట్టలు తెంచుకుంది. అన్నేసి గంటలు ఎక్కడుండాలి…? బేసిక్ నీడ్స్ పరిస్థితేంటి…? అత్యవసరాల సంగతేంటి…? అంటూ ఏడుపులు, పెడబొబ్బలు… చివరకు కన్నీటి సీన్సు కూడా బోలేడు కనిపించాయ్. కాస్త వయస్సు పైబడివాళ్ల పరిస్థితైతే దారుణమనే చెప్పాలి. కుంభమేళాను తలపిస్తున్న ఎయిర్‌పోర్టుల్లో లగేజీతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.
DGCA రూల్స్ మార్చినా పైలెట్ల కొరత తీరక పరిస్థితులేం మారలేదు. అంతరాయానికి చింతిస్తున్నామని ఇండిగో మేనేజ్‌మెంట్ క్షమాపణ చెప్పినా ప్రయాణీకులకు ఉపశమనం లేదు. ఇంతా జరుగుతుంటే… ఏ ఎయిర్‌లైన్స్ సంస్థ అయినా ఏం చేస్తుంది…? ఉన్నపళంగా బుకింగ్స్ ఆపేస్తుంది. పరిస్థితి గాడినపడ్డాక బుకింగ్స్ రీఓపెన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇండిగో మాత్రం దండిగానే పైసా వసూల్‌కు పాల్పడుతోంది. ఉన్న సర్వీసులే రద్దవుతుంటే కొత్త సర్వీసులకు టిక్కెట్లు అమ్ముకుంటోంది. దీంతో పాసింజర్ల కోపం పీక్స్‌కి చేరింది. బస్టాండ్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎయిర్‌పోర్టులుంటే బుకింగ్స్ కోసం పాకులాడటమేంటని ఆవేదనతో కూడిన ఆక్రోశం వెల్లగక్కుతున్నాయి.
మునుపెన్నడూ లేని దారుణ పరిస్థితులతో ఇండిగో ఓ చెత్త రికార్డును వెనకేసుకుంది. ప్రపంచదేశాలు భారత్ వైపు చూసేలా చేయడమే కాదు… తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చింది. క్రైసిస్ టైమ్‌లో హుందాగా ఉండాల్సింది పోయి… ఇండిగో ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్యాసింజర్లు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నా… కనీస అవసరాలు అందించడంలోనూ విఫలమవుతూ, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం అంతులేని ఆవేశానికి కారణమవుతోంది.
మరి ఇంతా జరుగుతుంటే విమానయాన శాఖ ఏం చేస్తోంది…? ఇండిగోను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతోంది…? ప్రయాణికుల ఇక్కట్లు పట్టవా…? అసలు అంతర్గతంగా ఏం జరుగుతోందన్న విషయాలపై దేశవ్యాప్తంగా హాట్ హాట్ డిబేట్స్ నడుతుస్తున్నాయ్.




