AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!

Mukesh Ambani: అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!

Phani CH
|

Updated on: Dec 06, 2025 | 5:10 PM

Share

ముఖేష్ అంబానీ నికర సంపద రూ. 10.14 లక్షల కోట్లు. రోజుకు రూ. 5 కోట్లు ఖర్చు చేసినా, ఈ మొత్తం ఖాళీ అవ్వడానికి 555 సంవత్సరాలు పడుతుంది. ధీరూభాయ్ అంబానీ 1966లో స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్స్, టెలికాం, రిటైల్‌తో సహా పలు రంగాల్లో $125 బిలియన్ల ఆదాయంతో విస్తరించింది. ఈ సామ్రాజ్యం రాత్రికి రాత్రే ఏర్పడలేదు, ఇది సుదీర్ఘ కృషి ఫలితం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద గణాంకాలు తరచుగా వార్తల్లో నిలుస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఈ గణాంకాలను లోతుగా పరిశీలించడానికి ప్రయత్నించారా? అంబానీ గురించి ఏ విషయాలు అయినా ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రపంచంలోని 16వ ధనవంతుడు. అతని మొత్తం సంపద భారత కరెన్సీలో సుమారు రూ. 10.14 లక్షల కోట్లుగా అంచనా. ఈ మొత్తం చాలా పెద్దది. ఒక వ్యక్తి సగటున దానిని లెక్కించడం ప్రారంభిస్తే అది జీవితకాలం పడుతుంది. ముఖేష్ అంబానీ ఒక్క పైసా కూడా సంపాదించకుండా, ఇప్పుడున్న సంపదను ఖర్చు చేయడం ప్రారంభిస్తే డబ్బు ఎంతకాలం ఉంటుంది? ముఖేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ రూ 10.14 లక్షల కోట్లు. అతను ప్రతిరోజూ రూ. 5 కోట్లు ఖర్చు చేస్తే… సంపదను ఖాళీ కావడానికి 555 సంవత్సరాలు అవుతాయి. ఇప్పటి నుండి ముఖేష్ అంబానీ ప్రతిరోజూ రూ.5 కోట్లు ఖర్చు చేసినా, అతని ఖజానా ఖాళీ కావడానికి ఇంకా ఐదు శతాబ్దాలు పడుతుంది. దీని అర్థం అతని భవిష్యత్ తరాలలో చాలామంది ఎటువంటి పని చేయకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ముఖేష్ అంబానీ సంపద రాత్రికి రాత్రే ఏర్పడింది కాదు. ఇది సుదీర్ఘ పోరాటం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను 1966లో ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ స్థాపించారు. ఈ సంస్థ దాదాపు USD 125 బిలియన్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్ పెట్రోకెమికల్స్, చమురు మరియు గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీని అతని తండ్రి ధీరూభాయ్ అంబానీ ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభించారు. ధీరూభాయ్ తన కెరీర్‌ను నూలు వ్యాపారిగా ప్రారంభించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత ముఖేష్ అంబానీ, అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు. తర్వాత ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఊరెళ్లేదెలా ??

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు

Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??