ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
భారతీయ రైల్వే నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు గొప్ప వార్త. 2026 జనవరి 1 నుండి బెడ్‌రోల్ సేవలను అందుబాటులోకి తేనుంది. బెడ్‌షీట్, దిండు కవర్‌లకు వరుసగా రూ.20, రూ.30 చెల్లించాలి. రెండూ కలిపి రూ.50. పైలట్ ప్రాజెక్ట్‌లో విజయవంతమయిన ఈ సేవ, ఇకపై సాధారణ ప్రయాణికులకు కూడా సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తుంది.
దూరప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. రైళ్లు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఏసీ కోచ్‌లో ప్రయాణించేవారికైతే బెడ్‌రోల్స్ కూడా అందిస్తారు. రైల్వే అందించే ఈ బెడ్‌రోల్‌లో 2 దిండ్లు, 2 బెడ్‌షీట్లు, 1 దుప్పటి ఉంటాయి. ఒక టవల్ కూడా అందిస్తారు. ఫస్ట్ AC, సెకండ్ AC, థర్డ్ AC అన్ని కోచ్‌లకు ఈ బెడ్‌రోల్ ఇస్తారు. అయితే, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో బెడ్‌రోల్ పొందడానికి అదనంగా రూ. 25 చెల్లించాలి. అయితే ఈ సదుపాయం ఇకపై నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి రానుంది. భారతీయ రైల్వే తాజాగా బెడ్ షీట్ల సేవల్లో భారీ మార్పు చేసింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్ కోచ్ ప్రయాణికులకు కూడా బెడ్ షీట్లు, దిండ్లు అందుబాటులోకి తెస్తోంది. ఇది చెన్నై డివిజన్‌లోని సదరన్ రైల్వే ప్రాంతంలో మొదటిసారిగా అమలు చేయనున్నారు. ఇక్కడ ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని డిమాండ్ మేరకు పొందుతారు. ఇది వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది. చలికాలంలో నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లో ప్రయాణించేవారు బెడ్‌షీట్లను అద్దెకు తీసుకుంటారు. 2023-24లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలుచెయ్యగా ప్రయాణికుల నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే, ఈ సౌకర్యం కొన్ని రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లో ప్రయాణించేవారు ఈ బెడ్‌రోల్‌ను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి రైల్వే ఫిక్స్‌డ్ ధర నిర్ణయించింది. బెడ్ షీట్ కావాలంటే రూ.20 చెల్లించాలి. దిండు కవర్ కావాలంటే రూ.30 చెల్లించాలి. రెండూ కావాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. వీటిని రాత్రి ఇచ్చి..మార్నింగ్ తిరిగి తీసుకుంటారు. ఇవి ఉచితం కాదు. వీటిని పొందాలంటే.. తప్పనిసరిగా టికెట్ చూపించాలి. ఎందుకంటే.. రిజర్వేషన్ లేని జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి ఈ సేవ అందుబాటులో లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
అవతార్ 3 థియేటర్లలో మహేష్ !! హాలీవుడ్‌లో మార్కెట్ పై జక్కన్న మాస్టర్ ప్లాన్
iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే
TOP 9 ET News: అఖండ రిలీజ్ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

