East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైరల్ ఫీవర్లు, డెంగీ, స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సంఖ్య భారీగా పెరిగింది. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నల్లి కాటుతో వచ్చే స్క్రబ్ టైఫస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో వైద్యం, సరైన జాగ్రత్తలు ముఖ్యం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జ్వర పీడితులు పెరుగుతున్నారు. చిన్న, పెద్ద, తేడా లేకుండా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సాధారణంగా కాకినాడ జీజీహెచ్ కు రోజూ 2 వేలకు పైగా ఓపీ ఉంటుంది. వీరిలో జ్వర పీడితులే అధికం. రాజమహేంద్రవరం జీజీహెచ్ లో రోజూ సుమారు వెయ్యి నుంచి 1200 వరకూ ఓపీ ఉంటే వీరిలో ఎక్కువ మంది సీజనల్ వ్యాధులతోనే ఆసుపత్రికి వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇటు కోనసీమలోనూ ఇదే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు విషజ్వరాల బారిన పడుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో నీరసించిపోతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు మాత్రం తగ్గడం లేదని మళ్లీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అసలే జ్వరంతో రోగులు బాధపడుతుంటే రకరకాల టెస్టులతో ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు మరింత నీరసించేలా చేస్తున్నారు. దీంతో పలువురు.. ఆసుపత్రులకు వెళ్లేందుకే భయపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పరిశీలిస్తే కాకినాడలో ఐదు వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 200కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు జిల్లాను స్క్రబ్ టైఫస్ కేసులు కలవరపెడుతున్నాయి. నల్లి లాంటి ఓ కీటకం కుట్టడం ద్వారా కుట్టినచోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడడం, జ్వరం, వాంతులు, తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు లక్షణాలతో ఆస్పత్రికి వచ్చేవారు అధికమయ్యారు. లాలాజలంతో ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్టు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. కాకినాడ జిల్లాలోనే అత్యధికంగా 1452 మందికి పరీక్షలు చేయగా కొన్ని కేసులు నమోదయ్యాయి. కాకినాడ, అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు వచ్చాయి. మిగతా మండలాల్లోను ఈ వ్యాధి బాధితులు ఉన్నారు. కోనసీమ జిల్లాలోనూ జ్వరపీడితులు ఉన్నారు. నవంబరులో అమలాపురం ఏరియా ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో 61మందిని జ్వర పీడితులుగా గుర్తించారు. జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులేమీ నమోదు కాలేదని వైద్యులు చెబుతున్నారు. కానీ స్క్రబ్ టైఫాస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
అవతార్ 3 థియేటర్లలో మహేష్ !! హాలీవుడ్‌లో మార్కెట్ పై జక్కన్న మాస్టర్ ప్లాన్
iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే
TOP 9 ET News: అఖండ రిలీజ్ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

