AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

Phani CH
|

Updated on: Dec 06, 2025 | 5:30 PM

Share

బ్యాంకులకు వారానికి 5 రోజులు పని దినాలు ఉండాలని బ్యాంక్ సంఘాల డిమాండ్ 2026లో అమలు అయ్యే అవకాశం ఉంది. అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతిపాదించింది. దీనివల్ల ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది, దీనికి ప్రభుత్వం మరియు ఆర్‌బీఐ ఆమోదం అవసరం. సిబ్బంది కొరత దీనికి అడ్డుకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బ్యాంకు పని దినాలు వారానికి 5 రోజులు ఉండాలని గత కొన్ని రోజులుగా బ్యాంకు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విధానం 2026 సంవత్సరంలో అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అన్ని శనివారాలను బ్యాంకు సెలవు దినాలుగా ప్రకటించాలన్న ప్రతిపాదనను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సమర్పించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 28, 2025న లోక్‌సభకు తెలియజేసింది. దీని ఫలితంగా బ్యాంకులు ఐదు రోజులు పని చేయడం జరుగుతుంది. బ్యాంకులు సోమవారం నుండి శుక్రవారం వరకు తెరిచి ఉంటాయి. అన్ని శనివారాలు, ఆదివారాల్లో మూసి ఉంటాయి. ఇది అమలు అయితే బ్యాంకు సిబ్బంది వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తే చాలు. దీనిపై ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తుండగా, వచ్చే ఏడాది అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రతీ శనివారం, ఆదివారం బ్యాంకులను మూసివేయాలని బ్యాంక్ అసోసియేషన్ సూచించింది. దీని వలన ఉద్యోగులు సోమవారం నుండి శుక్రవారం వరకు పని చేయాల్సి వస్తుంది. స్థిరమైన వారపు పని వేళలను నిర్వహించడానికి, ఉద్యోగులు వారంలోని ఐదు రోజులూ.. రోజుకు దాదాపు 40 నిమిషాలు ఎక్కువగా పని చేయాల్సి రావచ్చు. ఇది కస్టమర్ల సేవలపై ప్రభావం చూపదని యూనియన్ చెబుతోంది. బ్యాంకులు ఆగస్టు 2015లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం వర్క్ చేస్తున్నాయి. ఈ నిబంధనల ప్రకారం, ప్రతీ నెలా రెండో, నాల్గో శనివారాల్లో బ్యాంకులు పని చేయవు. ఇతర శనివారాల్లో తెరిచి ఉంటాయి. ఈ ప్రతిపాదన ఆగిపోవడానికి సిబ్బంది కొరత కారణం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 96శాతం ఉద్యోగాలు భర్తీ అయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన ఖాళీలు సాధారణ పదవీ విరమణ, ఇతర క్రమరహిత కారణాల వల్ల ఉన్నాయి. ఈ ప్రతిపాదనను ఎప్పటి నుంచి కార్యరూపంలోకి తీసుకువస్తారన్నది చెప్పలేదు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం, ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఊరెళ్లేదెలా ??

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు

Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??