- Telugu News Photo Gallery Cinema photos Do you know how this little girl who starred in the Lifebuoy ad looks like now
ఓడియవ్వ బంటీ.. ఒరేయ్ బంటీ..! లైఫ్ బాయ్ భామ మాములుగా లేదుగా.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్
‘బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?’ అంటూ లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్‌లో కనిపించిన చిన్నారి మీకు గుర్తుందా.? అప్పుడు క్యూట్ క్యూట్ మాటలతో అలరించిన ఈ చిన్నారి.. ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.
Updated on: Dec 06, 2025 | 10:57 PM

‘బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?’ అంటూ లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్‌లో కనిపించిన చిన్నారి మీకు గుర్తుందా.? అప్పుడు క్యూట్ క్యూట్ మాటలతో అలరించిన ఈ చిన్నారి.. ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

ఇంతకీ ఆమె మరెవరో కాదు అవనీత్ కౌర్. చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు లైఫ్ బాయ్ యాడ్‌తో పాటు మరికొన్ని యాడ్స్‌లోనూ ఈమె నటించింది. అంతేకాదు.. టీవీ షోలు, పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే పలు డ్యాన్స్ షోలలోనూ అదరగొట్టే డ్యాన్స్ పెర్ఫార్మన్స్‌లు చేసింది. మ్యూజిక్ వీడియోలతో పాటు పలు సీరియల్స్‌లో స్పెషల్ అప్పీయరెన్స్‌లు ఇచ్చింది.

‘మర్దానీ’ సినిమాలో మీరా అనే పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది అవనీత్ కౌర్. ‘టికు వెడ్స్ షేరు’ అనే సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘లవ్ కి అరేంజ్ మ్యారేజ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ‘లవ్ ఇన్ వియత్నాం’ అనే మూవీతో ఆకట్టుకుంది

‘బబ్బర్ కా తబ్బార్’, ‘బందిష్ బండిట్స్’ అనే రెండు వెబ్ సిరీస్‌లలో నటించి తన నటనకు గానూ మంచి మార్కులు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న అవనీత్ కౌర్.. ఎప్పటికప్పుడు వెకేషన్లకు వెళ్తూ గ్లామరస్ ఫోటోలతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది.

బికినీల్లో దర్శనమిస్తూ.. గ్లామర్ షోకు ఏమాత్రం హద్దులేవని పోజులు ఇస్తోంది. కాగా, ప్రస్తుతం ఈమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.




