రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికి, ఇద్దరూ ఒకే వాహనంలో ప్రయాణించారు. అనంతరం తన నివాసంలో జరిగిన విందులో మోదీ, పుతిన్‌కు రష్యన్ భగవద్గీతను బహూకరించగా, పుతిన్ దానిని ఆసక్తిగా పరిశీలించారు.