- Telugu News Photo Gallery Cinema photos Do you remember who the heroine is in this photo, She is Shalini Pandey
మరీ ఇంత మార్పా..! సినిమాల్లో క్యూట్ గర్ల్.. బయట మాత్రం హాట్ బాంబ్..
పై ఫోటోలోని అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. అదొక కల్ట్ క్లాసిక్. అందులో కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్లు ఇవ్వడమే కాదు.. అందం, అమాయకత్వం కలబోసి కుర్రకారును మాయ చేసింది.
Updated on: Dec 06, 2025 | 9:58 PM

పై ఫోటోలోని అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. అదొక కల్ట్ క్లాసిక్. అందులో కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్లు ఇవ్వడమే కాదు.. అందం, అమాయకత్వం కలబోసి కుర్రకారును మాయ చేసింది.

ఆమె మరెవరో కాదు అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు. హీరోగా విజయ్ దేవరకొండతో పాటు షాలిని పాండేకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆమె ఆ తర్వాత అదే క్రేజ్ కొనసాగించలేకపోయింది.

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన మహానటి చిత్రంలో కీలకపాత్ర పోషించింది షాలిని పాండే. ఆ తర్వాత 118, 100 పర్సెంట్ కాదల్, నిశబ్దం, జయేష్‌భాయ్ జోర్దార్ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఆశించినంతగా క్రేజ్ రాలేదు.

ఇటీవల అమీర్ ఖాన్ తనయుడితో మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి హిట్ సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అద్భుత రెస్పాన్స్ సాధించింది. ఇక ఈ చిత్రంలో షాలినీ పాండే నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. గ్లామరస్‌గా, బికినీలో పోజులిచ్చిన ఈ బ్యూటీ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. మరి మీరు ఓ లుక్కేయండి.