- Telugu News Photo Gallery Cinema photos These are the Tollywood heroines who got married for the second time besides Samantha
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ వీరే!
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు రెండో వివాహం చేసుకుంటూ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత , దర్శకుడు రాజ్ నిడిమోర్‌ను రెండో వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన అనేక వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఇప్పుడు మనం సమంతతో పాటు రెండో వివాహం చేసుకున్న బ్యూటీస్ ఎవరో చూద్దాం.
Updated on: Dec 06, 2025 | 9:23 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోర్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సమంత ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది, తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఇక మనస్పర్థల కారణంగా వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయి, వారి వారి కెరీర్ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక గత కొన్ని రోజుల నుంచి రాజ్ నిడిమోర్‌తో ప్రేమలో ఉన్న ఈ నటి రీసెంట్‌గా రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది.

నటి అదితి రావు హైదరీ కూడా రీసెంట్‌గా హీరో సిద్ధార్థ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటీ అంతక ముందు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకోగా, వారి మధ్య విభేదాలు రావడంతో, విడాకులు తీసుకొని, సిద్ధార్థ్‌ను రెండో వివాహం చేసుకుంది.

స్టార్ బ్యూటీ అమలా పాల్ కూడా రెడూ వివాహం చేసుకొని హ్యాప్పీగా తన లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ తమిళ డైరెక్టర్ ఎల్. విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. తర్వాత తనతో మనస్పర్థల కారణంగా విడిపోయి, జగత్ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకుంది.

బ్యూటీ రాధిక కూడా టాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్‌గా తన సత్తాచాటింది. కానీ వివాహ బంధంలో అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ బ్యూటీ రెండు పెళ్లీలు చేసుకొని విడాకులు తీసుకుంది. కానీ 2001లో శరత్ కుమార్ ను వివాహం చేసుకొని సంతోషంగా ఉంది.

నటి జయ సుధ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. అయితే ఈ నటి కూడా రెండో వివాహం చేసుకున్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ బ్యూటీ ముందు రాజేంద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా విడిపోవడంతో రెండో వివాహంను నితిన్ కపూర్‌ను చేసుకుంది.



