- Telugu News Photo Gallery Cinema photos This is the crazy movie that was missing from the Pawan Kalyan and Uday Kiran combo
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
చిత్ర పరిశ్రమలో ఒకరు అనుకున్న సినిమా మరొకరు చేయడం, ఒకరి కోసం కథ ప్రిపేర్ చేస్తే మరొక హీరో మూవీ చేసి హిట్ కొట్టడం కామన్. ఇక ఈ మధ్య మల్టీ స్టార్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాయి. చాలా మంది తమ ఫేవరెట్ హీరోస్ కలిసి మూవీ చేయాలని అభిమానులు కోరుకుంటారు. అయితే చాలా మంది ఫేవరెట్ హీరో అయిన దిగవంత ఉదయకిరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో కూడా ఒక మూవీ మిస్ అయ్యిందంట. ఇంతకీ అది ఏ మూవీ అనుకుంటున్నారా?
Updated on: Dec 06, 2025 | 9:05 PM

చిత్ర మూవీతో తెలుగు అభిమానులను పలకరించి, ఎన్నో యూత్ ఫుల్ మూవీస్ చేసి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న నటుడు ఉదయ్ కిరణ్. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే తెలుగు అభిమానుల మనసు గెలుచుకొని, స్టార్ హీరోలకు గట్టి పోటినిచ్చాడు.

మనసంతా నువ్వు, నువ్వే నేను, శ్రీరామ్,కలుసుకోవాలని, లాంటి ఎన్నో లవ్ స్టోరీ మూవీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అందరూ ఉదయ్ కిరణ్ వరస సినిమాలతో దూసుకెళ్తాడు అనుకున్నారు, కానీ ఆయన కొన్ని ఇబ్బందులు, ఫెయిల్యూర్స్, వలన మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఉదయ్ కిరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఓ క్రేజీ మూవీ రావాల్సింది ఉండేనంట. కానీ, కొన్ని కారణాల వలన సూపర్ మల్టీస్టార్ మూవీ మిస్స్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో బంగారం మూవీ ఒకటి. ఈ మూవీ రిలీజై సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ మూవీలో యంగ్ హీరో రాజా కీలక పాత్ర పోషిస్తాడు. అయితే ఆ పాత్ర కోసం ముందుగా మూవీ మేకర్స్ ఉదయ్ కిరణ్‌ను ఫిక్స్ చేశారంట. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంట. ఆ పాత్రలో ఉదయ్ కిరణ్ చాలా బాగా నటిస్తారని భావంచారంట. ఇక అంతా ఫిక్స్ అనుకునే సమయానికి, కొన్ని కారణాల వలన మూవీ మేకర్స్ ఉదయ్ కిరణ్‌ను మూవీలోకి తీసుకోలేదంట. అలా పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో రావాల్సిన సూపర్ హిట్ మూవీ మిస్సైంది.

ఇక ఉదయ్ కిరణ్ చేయాల్సిన పాత్రను బంగారం సినిమాలో రాజా పోషించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీ తర్వాత రాజా చాలా సినిమా ఆఫర్స్ అందుకొని, సక్సెస్ అందుకున్నాడు. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం ఆ సమయంలో వరస ఫెయిల్యూర్స్‌తో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఈ మూవీ చేసి ఉంటే, ఆయన కెరీర్ కాస్త ఫామ్‌లో ఉండేదని ఆయన అభిమానుల అభిప్రాయం.