యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రేరణ పొంది పిన్నీసులతో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పల్నాడు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హ్యాండిల్ లాక్ చేయకుండా వదిలేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని, సులభంగా స్టార్ట్ చేసి 11 బైక్లను దొంగిలించారు. ఎస్ఐ సంపత్ కుమార్, సీఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దొంగతనాలను ఛేదించారు.