29 November, 2025
Subhash
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం బీమా కవరేజీని పెంచారు.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.5లక్షల ఆరోగ్య బీమాను అందిస్తున్నారు. అయితే అర్హులైన కుటుంబాలకు ఈ బీమా కవరేజీని రూ.10లక్షలకు పెంచారు.
వయోపరిమితి 70 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో క్యాష్‌లెస్, పేపర్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు.
దీని ద్వారా రూ.10లక్షల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా ముందుగా ఉన్న అన్ని వ్యాధులు మొదటి రోజు నుండే కవర్ అవుతాయి.
దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉన్న కుటుంబాలూ ఈ పథకం ద్వారా పూర్తి బీమా కవరేజీని పొందవచ్చు. దీనికి ఎలాంటి వయోపరిమితి, లింగ పరిమితి లేదు.
కుటుంబానికి లభించే ఇన్సూరెన్స్ కవరేజీకి ఇది అదనం. దీని వల్ల ఫ్యామిలీ మొత్తం బీమా కవరేజీ రూ.10 లక్షలకు చేరుకుంటుంది.
ఈ పథకం కోసం ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు దాటిన వ్యక్తులు ఈ అదనపు బీమా కవరేజీ పొందేందుకు అర్హులు.