7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపికబురు.! ఆ పెంపుకు కేంద్రం సిద్దం.?
ఉద్యోగులకు మరోసారి తీపికబురు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను..
ఉద్యోగులకు మరోసారి తీపికబురు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచిన కేంద్రం.. త్వరలోనే హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్‌ఆర్‌ఏ) పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోందట. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఇక జనవరి 1, 2022 నుంచి పెంచిన డీఏ అమలులోకి వచ్చింది. ఇదిలా ఉంటే.. సాధారణంగా డీఏ పెరిగిందంటే.. ఇతర అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి. ఇప్పుడూ ఇదే జరగబోతోంది.
అయితే గతేడాది హెచ్ఆర్ఏను పెంచిన కేంద్రం.. మరోసారి పెంపుకు ఆమోదం తెలుపుతుందా అని నిపుణుల్లో సందేహం వ్యక్తం అవుతోంది. కానీ హెచ్ఆర్ఏ మాత్రం ఒకవేళ పెరిగితే.. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఇది ఎంతోమంది ఉద్యోగులకు ఊరట కలిగిస్తుంది. ఉద్యోగులు వారి కేటగిరీల వారీగా ప్రస్తుతం 27 శాతం, 18 శాతం, 9 శాతం హెచ్‌ఆర్‌ఏ రేట్లు పొందుతున్నారు. ఇక కేంద్రం ఈ రేట్లను పెంచాలని యోచిస్తోంది. ఎక్స్ కేటగిరి వారికి 3 శాతం.. వై కేటగిరి వారికి 2 శాతం, జెడ్ కేటగిరి ఉద్యోగులకు 1 శాతం మేరకు హెచ్‌ఆర్ఏ పెంపు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కేంద్రం త్వరలోనే దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశముంది.
ఇవి కూడా చదవండి: