Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..

తెలుగు ప్రేక్షకులకు హీరో సిద్ధార్థ్  (Siddarth) సుపరిచితమే. బాయ్స్ సినిమాతో టాలీవుడ్‏కు హీరోగా పరిచయమైన సిద్ధార్థ్.. ఆ తర్వాత వచ్చిన

Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..
Siddu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2022 | 3:06 PM

తెలుగు ప్రేక్షకులకు హీరో సిద్ధార్థ్  (Siddarth) సుపరిచితమే. బాయ్స్ సినిమాతో టాలీవుడ్‏కు హీరోగా పరిచయమైన సిద్ధార్థ్.. ఆ తర్వాత వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సిద్ధూ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో బొమ్మరిల్లు, చుక్కల్లో చంద్రుడు, ఆట, కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, ఓయ్, అనగనగా ఓ ధీరుడు, బావ, ఓ మై ఫ్రెండ్, జబర్దస్త్.. వంటి తెలుగు చిత్రాల్లో నటించి యూత్‏లో ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత సిద్ధూ తెలుగు చిత్రపరిశ్రమగా మెల్ల మెల్లగా దూరమైపోయాడు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమాలో తారక్ స్నేహితుడిగా కనిపించి మెప్పించాడు. ఇటీవల మహా సముద్రం సినిమాతోలో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు సిద్ధూ.. శర్వానంద్.. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా సిద్ధార్థ్ మరో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్త ఇటకీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ త్రిభాషా చిత్రంలో సిద్ధూ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి డైరెక్టర్ ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ప్రకటించిన ఈ త్రిభాషా చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. అద్భుతమైన క్లాసికల్ కథ కుదిరిందని.. సినిమా షూటింగ్ తమిళనాడులోని పళనిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం తనకు చాలా బహుమతులు, చాలా ఆనందాన్ని ఇచ్చిందని.. ప్రస్తుతం ఈ సినిమాలో భాగమైనందుకు చాలా గౌరవంగా.. ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు సిద్ధూ.

Also Read: Alia- Ranbir wedding: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన అలియా రణబీర్ ల వైరల్ అవుతున్న

ఫొటోస్..

Acharya: మెగా అభిమానులకు కనుల పండువ.. అన్న కోసం తమ్ముడు.. ఒకే వేదికపై మెగా హీరోల సందడి..

Nagabhushanam: అసాధారణమైన నటనా కౌశల్యం.. విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన విలక్షణ నటుడు నాగభూషణం

‘Archery’: ఆర్చరీ షూటింగ్ ప్రారంభం.. ముగ్గురు బాలీవుడ్ నట వారసులు బీ టౌన్‌లో ఎంట్రీ