Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Archery’: ఆర్చరీ షూటింగ్ ప్రారంభం.. ముగ్గురు బాలీవుడ్ నట వారసులు బీ టౌన్‌లో ఎంట్రీ

'Archery': ఓటీటీ(OTT) వేదికగా బాలీవుడ్(Bollywood) నట వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ( Netflix) కోసం ఫేమస్ ఫిల్మ్ మేకర్ జోయా అఖ్తర్ తెరకెక్కిస్తున్న..

'Archery': ఆర్చరీ షూటింగ్ ప్రారంభం.. ముగ్గురు బాలీవుడ్ నట వారసులు బీ టౌన్‌లో ఎంట్రీ
Arches
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2022 | 10:54 AM

‘Archery’: ఓటీటీ(OTT)  వేదికగా బాలీవుడ్(Bollywood) నట వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ( Netflix) కోసం ఫేమస్ ఫిల్మ్ మేకర్ జోయా అఖ్తర్ తెరకెక్కిస్తున్న ‘ది ఆర్చీస్‌’ షూటింగ్ ప్రారంభమైంది. ది ఆర్చీస్‌ లో మూడు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ నట వారసులు నటిస్తున్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, బోనీకపూర్ వారసురాలు దివంగత శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ లు ఒకే సారి బీ టౌన్ లో ఎంట్రీ ఇస్తున్నారు.

జోయా అక్తర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి రోజు షూటింగ్ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ‘ది ఆర్చీస్‌’ అమెరికన్‌ కామిక్‌ సిరీస్‌. దీని ఆధారంగా బాలీవుడ్‌ దర్శకురాలు జోయా అఖ్తర్‌ రూపొందిస్తున్నారు. హిందీ వెర్షన్ లో తెరకెక్కుతున్న ఈ సీరీస్ కు కూడా ‘ది ఆర్చీస్‌’అనే టైటిల్ ను ఖరారు చేశారు.

రీమా కాగ్టీ నిర్మిస్తుండగా.. అమితాబ్‌ కూతురు శ్వేత తనయుడు అగస్త్య నంద, షారుఖ్‌ ఖాన్‌, బోనీ కపూర్‌ కూతుళ్లు సుహానా, ఖుషీ లు ‘ది ఆర్చీస్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముగ్గురు వారసులు ఒకే సినిమాతో సినీ రంగంలో అడుగు పెడుతుండడంతో అభిమానుల్లో క్రేజ్‌ ఏర్పడింది. “ఆర్చీస్‌ షూట్‌ స్టార్ట్స్‌…” అంటూ ప్రొడ్యూసర్‌ రీమా ఇన్‌ స్టాగ్రామ్‌లో ప్రకటించారు.

ఈ పోస్ట్‌పై నటి దియా మీర్జా స్పందిస్తూ, “గో బేబీ” అని అన్నారు. అభిషేక్ బచ్చన్ .. చాలా సంతోషం అంటూ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఇక కరణ్ జోహార్ హృదయపూర్వక ఎమోజీలతో “జోయా” అని చెప్పాడు. జాన్వీ కపూర్, అనన్య పాండే , నవ్య నవేలి అంటూ తమ విషెష్ ను తెలిపారు. అగస్త్య తల్లి శ్వేతా బచ్చన్, యూనిట్ కు “అభినందనలు”  చెప్పారు.

View this post on Instagram

A post shared by Zoya Akhtar (@zoieakhtar)

 

Also Read: