Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..

ట్యాలెంట్ ఎవడొక్కడి సొత్తు కాదని మరో సారి ప్రూఫ్ చేశాడు యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చిన్నా చితకా క్యారెక్టర్స్‌

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2022 | 8:13 PM

ట్యాలెంట్ ఎవడొక్కడి సొత్తు కాదని మరో సారి ప్రూఫ్ చేశాడు యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చిన్నా చితకా క్యారెక్టర్స్‌ చేస్తూనే డీజె టిల్లు ఆఫర్ అందిపుచ్చుకున్నాడు సిద్దూ. ఆ సినిమా ఇచ్చిన సూపర్ డూపర్ హిట్‏లో తనలో దాగున్న ట్యాలెంట్ ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు. ఇక ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్ కొట్టేసి…. లక్కంటే ఇదిరా భాయ్‌ అని పక్క హీరోలతో అనిపించుకుంటున్నాడు. డిజే టిల్లు సినిమాతో యూత్‏లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన డిజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మించింది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ సరసన నేహ శెట్టి నటించింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. సిద్దు జొన్నల గడ్డకు బంపర్‌ ఆఫర్ ఇచ్చారట స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు. స్వతహాగా రైటర్ అయిన సిద్దును స్క్రిప్ట్ తో తన దగ్గరకు వచ్చి కలవాలని దిల్ రాజు చెప్పారట. స్టోరీ ఓకే అయితే ఇమ్మీడియట్‌ గా సినిమా చేద్దామని కమిట్మెంట్ కూడా ఇచ్చారట స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. దీంతో ఈ యంగ్ హీరో ఓకొత్త పాయింట్‌తో స్టోరీ రాసేందుకు రెడీ అవుతున్నారట. డీజె టిల్లు లాంటి యాటిట్యూడ్ అండ్ క్యారెక్టరైజేషన్ ఉన్న న్యూ క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నారట. ఇప్పుడిదే న్యూస్ అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్‌మీడియాలోనూ తెగ వైరల్‌ అవుతోంది.

Also Read: The Kashmir Files: ఓటీటీలోకి ది కాశ్మీర్ ఫైల్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్‏లో ఉపాసన సందడి.. చరణ్‏కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..

Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్డేట్.. చివరి దశలో షూటింగ్.. మాస్ సాంగ్‏తో ఫైనల్..