Biliti Electric: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతిపెద్దది..!

Biliti Electric: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో కస్టమర్లు కూడా వాటివైపే మొగ్గు చూపుతున్నారు...

Biliti Electric: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతిపెద్దది..!
Follow us

|

Updated on: Apr 19, 2022 | 8:53 PM

Biliti Electric: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో కస్టమర్లు కూడా వాటివైపే మొగ్గు చూపుతున్నారు. ఇక కాలిఫోర్నియా (California)కు చెందిన బిలిటీ ఎల‌క్ట్రిక్ కంపెనీ.. ప్రపంచం (World)లోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీ-వీల‌ర్ ఫ్యాక్టరీ (3-wheeler factory)ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి రాహుల్‌ గయాం వెల్లడించారు. ప్రతి సంవత్సరం 2,40,000 ఎలక్ట్రాక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అమెరికాకు చెందిన విద్యుత్‌ ఆధారిత వాహనాల (EV) తయారీ కంపెనీ ఫిస్కర్‌.. హైదరాబాద్‌లో తమ రెండో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ స‌ర‌స‌న బిలిటీ ఎల‌క్ట్రిక్ కంపెనీ ఏర్పాటు కానుంది.

కొత్త ప్లాంట్‌లో 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి:

ఈ కొత్త ప్లాంట్‌లో 150 మిలియన్‌ డాలర్లతో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్లాంట్‌ తయారీతో దాదాపు 3వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతో నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతంబిలిటీ కంపెనీ హైద‌రాబాద్‌కు చెందిన గ‌యాం మోటార్ వ‌ర్క్స్‌తో క‌లిసి త్రీ వీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ఉత్పత్తి చేయ‌నుంది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల పాల‌సీని ప్రారంభించింద‌ని తెలిపారు. బిలిటీ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీ- వీల‌ర్ ఫ్యాక్టరీని ప్రారంభించ‌బోతుంద‌న్నారు. ఈ ఏడాది బిలిటీ కంపెనీదే అతిపెద్ద పెట్టుబ‌డి అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Sri Lanka Economic Crisis: అక్కడ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌కు రూ.338.. కొనసాగుతున్న ఆందోళనలు

IRCTC Tour Package: పర్యటకులకు గుడ్‌న్యూస్.. ఐఆర్‌సీటీసీ కశ్మీర్‌ టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు!

EPFO: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్‌..? వేతన పరిమితి రూ.21వేలకు పెంపు..!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ