Sri Lanka Economic Crisis: అక్కడ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌కు రూ.338.. కొనసాగుతున్న ఆందోళనలు

Sri Lanka Economic Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది. కష్టాల నుంచి బయటపడేందుకు ధరలను పెంచేస్తోంది...

Sri Lanka Economic Crisis: అక్కడ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌కు రూ.338.. కొనసాగుతున్న ఆందోళనలు
Sri Lanka Economic Crisis
Follow us
Subhash Goud

|

Updated on: Apr 19, 2022 | 6:52 PM

Sri Lanka Economic Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది. కష్టాల నుంచి బయటపడేందుకు ధరలను పెంచేస్తోంది. ఈ సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలకు జీవన విధానం పెద్ద గండంగా మారింది. అప్పులు పెరిగిపోతున్న నేపథ్యంలో మా వల్ల కాదంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిత్యావసరం సరుకుల ధరలతో పాటు పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ (Diesel) ధరలను పెంచిన ఆ దేశ ప్రభుత్వం.. మరోసారి చమురు ధరలను పెంచింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెరగడంతో అక్కడి ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా శ్రీలంక ప్రభుత్వం (Sri Lanka Government) పెట్రోల్‌,డీజిల్‌ ధరలను పెంచేసింది. తాజా పెంపుతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.338కి చేరింది. లీటర్‌ పవర్‌ పెట్రోల్‌ ధర రూ.373 పెరిగింది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీరుపై రోజురోజుకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌లో కూడా విపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఈ కారణంగా పలుసార్లు సమావేశాలు వాయిదా పడ్డాయి.

అంతర్జాతీయంగా అధిక ధరలు, డాలర్‌తో శ్రీలంక రూపాయి క్షీణత ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కొంతవరకు విదేశీ కరెన్సీ కొరత కారణంగా ఏర్పడింది. దేశం ప్రధాన ఆహారాలు, ఇంధనం దిగుమతుల కోసం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా భారీ ప్రజాందోళన మంగళవారంతో పదకొండవ రోజుకు చేరుకుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా అధ్యక్షుడు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అలాగే సేంద్రియ ఎరువులతో హరిత వ్యవసాయ విధానానికి మారడానికి రాజపక్సే 2020 మధ్యలో ఎరువుల దిగుమతుల వినియోగాన్ని నిషేధించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ధరల పెంపుపై నిరసనలు కొనసాగుతున్నాయి. రామ్ బుక్కన్న రైల్వే ట్రాక్ పట్టాలు ఆందోళనకారులు తొలగించారు. రామ్ బుక్కన్న పోలీసు స్టేషన్ పై రాళ్ళ దాడికి దిగారు. దీతో ఆందోళన కారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్ల వర్షం కురిపించిన పోలీసులు. ఈ ఘననలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

World Hottest City: ప్రపంచంలో వేసవిలో అత్యధికంగా వేడిగా ఉండే ప్రాంతం ఎక్కడుందో తెలుసా..?

Blast in Kabul: కాబూల్‌లో వరుస పేలుళ్లు.. 25 మంది విద్యార్ధుల మృతి.. ఘాతుకం వెనుక ఐసిస్‌ ఉగ్రవాదుల హస్తం!