World Hottest City: ప్రపంచంలో వేసవిలో అత్యధికంగా వేడిగా ఉండే ప్రాంతం ఎక్కడుందో తెలుసా..?

World Hottest City: ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. బారీ ఎండల కారణంగా హీట్‌స్టోక్‌ వచ్చే అవకాశాలున్నాయి..

World Hottest City: ప్రపంచంలో వేసవిలో అత్యధికంగా వేడిగా ఉండే ప్రాంతం ఎక్కడుందో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 18, 2022 | 6:54 PM

World Hottest City: ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. బారీ ఎండల కారణంగా హీట్‌స్టోక్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఇంట్లో ఫ్యాన్, కూలర్, ఏసీ ఉన్నంత మాత్రాన ఫర్వాలేదు కానీ మధ్యాహ్నం ఇంటి నుంచి రోడ్డుపైకి రాగానే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అత్యంత వేడి ఉండే ప్రాంతం పాకిస్తాన్‌ (Pakistan)లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశం. భూమిపై అత్యధిక వేడి పాకిస్తాన్‌లోని జాకోబాబాద్‌ (Jacobabad)లో వస్తుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 52-53 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అయితే ప్రపంచంలో కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 56.7 డిగ్రీల సెల్సియస్ (134 డిగ్రీల ఫారెన్‌హీట్) నమోదైనప్పటికీ.. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్ ను కూడా అత్యంత వేడిగా ఉండే నగరంగా గుర్తించారు శాస్త్రవేత్తలు. జాకోబాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలలో భూమి చాలా వేడెక్కుతుంది. కింద పాదాలు పెట్టాలంటేనే కష్టతరమవుతుంది. 2018 సంవత్సరంలో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉన్న టర్బాట్ ఆసియాలో అత్యంత వేడిగా ఉండే నగరంగా రికార్డుకెక్కింది. UKలోని లాఫ్‌బరో విశ్వవిద్యాలయంలో వాతావరణ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ టామ్ మాథ్యూస్ మాట్లాడుతూ.. పాక్‌లోని జాకోబాబాద్ తీవ్రమైన వేడి ఉంటుందని, దీని కారణంగా సూర్యుని ప్రత్యక్ష వేడిని ఎదుర్కోవలసి వస్తుంది. అరేబియా సముద్రం తేమతో కూడిన గాలులు, ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ప్రమాదకరంగా పెరుగుతుంది.

ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత వేడి ఉన్న ప్రదేశంగా గుర్తించబడింది. ఇథియోపియాలోని అఫార్ ప్రాంతంలోని దనాకిల్. 34.4 °C కంటే ఎక్కువగా ఉండే దనకిల్‌లో సగటు ఉష్ణోగ్రత ఏడాది పొడవునా ఒకే విధంగా ఉంటుంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 125 మీటర్ల దిగువన ఉంది. ఇక్కడ వేడి ఎక్కువ, వర్షం కూడా చాలా తక్కువ. సంవత్సరానికి 100-200 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుందని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రపంచంలోని చాలా వేడి ప్రదేశాలు అప్పుడప్పుడు లేదా కొన్ని నెలల పాటు వేడిగా ఉంటుంది. అయితే ఇక్కడ వార్షిక సగటు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. దనకిల్ డిప్రెషన్ సీజన్ చాలా వేడిగా ఉన్నప్పటికీ ఇక్కడ జనాభా చాలా ఎక్కువ.

ఇవి కూడా చదవండి:

Viral Video: పాము-ముంగిస మధ్య భీకరపోరు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

PPF Account: పీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా..? ఈ నియమాలు తెలుసుకోండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!