PPF Account: పీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా..? ఈ నియమాలు తెలుసుకోండి

PPF Account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలలో ఇదొకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెడుతున్నారు...

PPF Account: పీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా..? ఈ నియమాలు తెలుసుకోండి
Follow us

|

Updated on: Apr 18, 2022 | 2:47 PM

PPF Account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలలో ఇదొకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెడుతున్నారు. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. చాలా తక్కువ పన్ను రహిత పథకాలలో PPF ఒకటి . అంటే మీరు PPFకి చేసిన కంట్రిబ్యూషన్, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీపై అందుకున్న మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది ప్రభుత్వ మద్దతు కలిగిన చిన్న పొదుపు విధానంలో ఒక భాగం. ఇది మెచ్యూరిటీ సమయంలో హామీతో కూడిన రాబడిని అందిస్తుంది.

పీపీఎఫ్‌ వడ్డీ:

ప్రస్తుతం పీపీఎఫ్‌పై ఏడాదికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. రిస్క్ లేని పొదుపు కోసం అందుబాటులో ఉన్న EPF తర్వాత అత్యధిక వడ్డీ రేట్లలో ఇది ఒకటి. PPF ఖాతాదారులు కూడా కొన్ని షరతులకు లోబడి సంవత్సరానికి 1% వడ్డీతో వారి ఖాతాలో రుణం తీసుకోవచ్చు. PPF ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. మీరు నిర్దిష్ట నిబంధనల ప్రకారం మీ ఖాతాను ముందుగానే క్లోచ్‌ చేసుకోవచ్చు. PPF ఖాతా నుండి ముందస్తు ఉపసంహరణ చేయవచ్చు. అయితే దీని కోసం ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించారు. వీటి కింద మాత్రమే ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రాయల్ చేయవచ్చు. ప్రతి నెల 5వ తేదీ వరకు డబ్బు డిపాజిట్ చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. మీరు ప్రతి నెలా 5వ తేదీలోపు PPF ఖాతాలో డబ్బు జమ చేస్తే, మీకు నెల మొత్తానికి వడ్డీ లభిస్తుంది. 5వ తేదీ తర్వాత డిపాజిట్ చేస్తే, ఆ నెలలో ఆ డిపాజిట్‌పై వడ్డీ ప్రయోజనం ఉండదు. వడ్డీ ప్రతి నెల 5వ తేదీ, నెల చివరి తేదీ మధ్య కనీస మొత్తంపై లెక్కించబడుతుంది.

మీరు PPF నుండి ఎప్పుడు డబ్బు తీసుకోవచ్చు:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. ఖాతాదారులు ఖాతా తెరిచిన తేదీ నుండి 5 ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి PPF ఖాతాల నుండి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు జనవరి 2022లో PPF ఖాతాను తెరిస్తే, మీరు 2027-28 ఆర్థిక సంవత్సరంలో డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత ఖాతా మెచ్యూర్ అయ్యే వరకు మీరు మీ PPF ఖాతా నుండి మొత్తం డబ్బును విత్‌డ్రా చేయలేరు. అంటే ఏ సమయంలోనైనా మీ PPF ఖాతాలోని బ్యాలెన్స్ మొత్తంలో100% ఉపసంహరించకూడదు.

ఖాతాదారుడు ఖాతా తెరిచిన సంవత్సరంలో తప్ప 5 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే 2020-21లో ఖాతా తెరిచి ఉంటే, ఇండియా పోస్ట్ మార్గదర్శకాల ప్రకారం.. 2026-27లో లేదా తర్వాత ఉపసంహరణ చేయవచ్చు. PPF అనేది పన్ను రహిత పథకం. మీరు ముందస్తు ఉపసంహరణ సమయంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. PPF ఖాతా నుండి ముందస్తు ఉపసంహరణకు కూడా ఎటువంటి ఛార్జీ ఉండవు.

ఇవి కూడా చదవండి:

Bank Alert: SBI కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ దిగ్గజం..

EV Showroom Fire: మంటల్లో ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ కాలిబూడిద.. తమిళనాడులో చోటుచేసుకున్న ప్రమాదం..