Bank Alert: SBI కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ దిగ్గజం..

Bank Alert: నిత్యావసరాలైన సబ్బుల నుంచి పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్ వరకు అనేక వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇటువంటి సమయంలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం తన వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Bank Alert: SBI కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ దిగ్గజం..
Sbi
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 18, 2022 | 12:35 PM

Bank Alert: నిత్యావసరాలైన సబ్బుల నుంచి పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్ వరకు అనేక వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీని వల్ల ఇప్పటికే ప్రజలపై చాలా భారం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు వల్ల లోన్ తీసుకునే వారిపై ఇకపై వడ్డీ భారం పెరగనుంది. SBI మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు MCLRను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అన్ని కాల పరిమితుల్లోని రుణాలపై ఈ పెంపు వర్తిస్తుందని బ్యాంక్ వెల్లడించింది. ఏప్రిల్ 15 నుంచే రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. దీని వల్ల గృహ, కార్ లోన్ వంటి వాటిపై ఈఎంఐ భారం పెరగనుంది.

ఎంసీఎల్ఆర్ రేటు పెంపును ఒకసారి గమనిస్తే.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి చేరింది. నెల ఎంసీఎల్ఆర్ కూడా ఇదే స్థాయిలో 6.65 నుంచి 6.75 శాతానికి పెరిగింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ అయితే 6.65 శాతం నుంచి 6.75 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతానికి ఎగబాకింది. ఏడాది ఎంసీఎల్ఆర్ ఇది వరకు 7 శాతంగా ఉండేది.. కానీ ఇప్పుడది 7.10 శాతానికి చేరింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా 7.2 శాతం నుంచి 7.3 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ ఇది వరకు 7.3 శాతంగా ఉండేది. ప్రస్తుతం అది 7.4 శాతానికి చేరుకుంది.

కాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించాలని నిర్ణయించింది. కానీ.. ద్రవ్యోల్బణం వల్ల పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇతరాల వల్ల బ్యాంకులు మాత్రం లోన్ వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. దీని వల్ల కొత్తగా లోన్ తీసుకునే వారికి గతంలో కన్నా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే.. వారిపై ఈఎంఐ భారం పెరుగుతుంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Hindi Jobs: మీకు హిందీ తెలిస్తే చాలు పంట పండినట్లే.. ఆ దేశాల్లో లక్షల్లో జీతాలు..

Buying House: సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇది సరైన సమయమేనా..? పూర్తి వివరాలు..