AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Showroom Fire: మంటల్లో ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ కాలిబూడిద.. తమిళనాడులో చోటుచేసుకున్న ప్రమాదం..

EV Showroom Fire: ఒకినావా కంపెనీకి(Okinawa dealership) చెందిన ఈ- స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో ఆటోటెక్ డీలర్‌షిప్ మొత్తం కాలి బూడిదైంది. వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రమాదాలు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది.

EV Showroom Fire: మంటల్లో ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ కాలిబూడిద.. తమిళనాడులో చోటుచేసుకున్న ప్రమాదం..
Okinawa
Ayyappa Mamidi
|

Updated on: Apr 18, 2022 | 11:33 AM

Share

EV Showroom Fire: ఒకినావా కంపెనీకి(Okinawa dealership) చెందిన ఈ- స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో ఆటోటెక్ డీలర్‌షిప్ మొత్తం కాలి బూడిదైంది. ఈ తాజా ఘటన తమిళనాడులో(Tamilnadu) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. స్థానికుల సహకారంతో మంటలు షోరూమ్ నిర్వాహకులు అదుపుచేశారు. ఈ ఏడాది వేసవి ప్రారంభమైన తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరగటం ఇది 6 సారి. తమిళనాడులో డీలర్‌షిప్ మంటల్లో కాలిపోవటానికి ముందు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒకినావా ఏప్రిల్ 16న.. ప్రైజ్ ప్రో మోడల్ కు చెందిన 3,215 యూనిట్ల స్కూటర్‌లను రీకాల్ చేసింది. EV తయారీదారు తన డీలర్‌షిప్‌లో తాజా EV అగ్నిప్రమాదంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

బ్యాటరీలకు సంబంధించిన “ఏదైనా సమస్య” ఉంటే పరిష్కరించేందుకే వాహనాల రీకాల్ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. “బ్యాటరీలు లూజ్ కనెక్టర్లు లేదా ఏదైనా డ్యామేజ్ ఉన్నాయేమోనని కంపెనీ తనిఖీ చేయనుంది. దేశంలో ఏదైనా అధీకృత డీలర్‌షిప్‌ల్లో ఉచితంగా మరమ్మతులు చేయించుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. వాహనాదారులు దీనిని వినియోగించుకోవాలని తెలిపింది. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నందున.. EV అగ్ని ప్రమాదాల్లో పాల్గొన్న బ్యాచ్‌లను స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని EV ఒరిజినల్ పరికరాల తయారీదారులను NITI ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ గత వారం కోరారు.

మార్చి 26న తమ ఇంటి వద్ద ఛార్జ్ అవుతున్న ఒకినావా స్కూటర్ బ్యాటరీలో పేలుడు కారణంగా ఒక తండ్రీ-కూతురు మరణించారు. గత నెల చివర్లో, పూణెలో రోడ్డు పక్కన పార్క్ చేసిన Ola S1 ప్రో ఈ- స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో వాహనం మొత్తం దగ్ధమైంది. మహారాష్ట్రలో, జితేంద్ర ఎలక్ట్రిక్ వాహనాలకు చెందిన అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ 9న నాసిక్‌లో అగ్నికి ఆహుతయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా స్కూటర్ సాంకేతిక బృందాలను వాహనాల్లో మంటలు చెలరేగటంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పిలిపించింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Buying House: సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇది సరైన సమయమేనా..? పూర్తి వివరాలు..

Stock Market: స్టాక్ మార్కెట్ పై బేర్ పంజా.. ట్రేడింగ్ వేళల్లో మార్పులు తెచ్చిన RBI..