AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్టాక్ మార్కెట్ పై బేర్ పంజా.. ట్రేడింగ్ వేళల్లో మార్పులు తెచ్చిన RBI..

Stock Market Timings: నాలుగు రోజుల విరామం తరువాత తెరుచున్న భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా నష్టపోయింది.

Stock Market: స్టాక్ మార్కెట్ పై బేర్ పంజా.. ట్రేడింగ్ వేళల్లో మార్పులు తెచ్చిన RBI..
Stock Market
Ayyappa Mamidi
|

Updated on: Apr 18, 2022 | 11:08 AM

Share

Stock Market Timings: నాలుగు రోజుల విరామం తరువాత తెరుచున్న భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా నష్టపోగా.. మరో సూచీ నిఫ్టీ 270 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 660, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 330 పాయింట్లకు పైగా నష్టపోయాయి. నేటి నుంచి స్టాక్ మార్కెట్లు ఉదయం 9 నుంచి ట్రేడింగ్ ప్రారంభమవుతాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. రోజులో ట్రేడింగ్ వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు ఉన్నాయి. గతంలో ఈ వేళలు ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30గా ఉండేవి. జీఎస్టీ రేట్ల పెంపు, బంగారం ధర నెల రోజుల గరిష్ఠాన్ని తాకటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీ షేర్లు ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి.

ప్రభావితం చేసిన కారణాలివే..

దేశీయంగానూ ద్రవ్యోల్బణం వంటి గణాంకాలు సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. అటు అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం నమోదవుతుండడంతో మార్కెట్లలో జాగ్రత్త కనిపిస్తోంది. పరపతి విధానం కఠినంగా ఉండొచ్చన్న అంచనాల మధ్య విదేశీ నిధుల ప్రవాహం స్తబ్ధుగానే ఉండొచ్చని భావిస్తున్నారు. రష్యా- ఉక్రెయిన్‌ పరిణామాలపైనా మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు కొనసాగొచ్చు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో చైనాలో ఆర్థిక వృద్ధి మందగించిందన్న గణాంకాలూ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అక్కడ భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండడం.. షాంఘై ఇంకా ఆంక్షల్లోనే కొనసాగుతుండడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

గమనించాల్సిన షేర్స్..

  1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: జనవరి- మార్చి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో రూ.10,055.20 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. లాభం 23 శాతం పెరిగింది.
  2. ఇన్ఫోసిస్‌: గత ఆర్థిక సంవత్సరం నాలుగో (జనవరి- మార్చి) త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాలంలో ఆర్జించిన రూ.5,076 కోట్లతో పోలిస్తే నికర లాభం 12 శాతం పెరిగింది.
  3. మహీంద్రా అండ్‌ మహీంద్రా: మహీంద్రా శాన్యో స్పెషల్‌ స్టీల్‌(ఎమ్‌ఎస్‌ఎస్‌పీఎల్‌)లో తనకున్న 22.81 శాతం వాటా(34.75 లక్షల షేర్లు)ను జపాన్‌కు చెందిన శాన్యో స్పెషల్‌ స్టీల్‌కు విక్రయించడానికి అంగీకరించినట్లు కంపెనీ తెలిపింది.
  4. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌: జనవరి-మార్చిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నికర లాభం రెండింతలకు పైగా పెరిగి రూ.185 కోట్లకు చేరుకుంది.
  5. ఎన్‌సీసీ: మౌలిక సదుపాయాల రంగ సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్‌లో బిగ్‌బుల్‌గా ప్రాచుర్యం కలిగిన అగ్రశ్రేణి స్టాక్‌మార్కెట్‌ మదుపరి రాకేశ్‌ జున్ జున్ వాలా, ఆయన భార్య రేఖ జున్ జున్ వాలా తాజాగా పెద్దమొత్తంలో షేర్లు కొనుగోలు చేసి తమ వాటా పెంచుకున్నారు. ఈ ఏడాది జనవరి- మార్చిలో వీరు ఈ సంస్థలో అదనంగా 44 లక్షల షేర్లు కొనుగోలు చేశారు.
  6. జొమాటో: కొత్త ఆహార నాణ్యతా విధాన అమలు తేదీని ఏప్రిల్‌ 18 నుంచి మే 3కు జొమాటో వాయిదా వేసింది. కొత్త విధానంపై రెస్టరెంట్ల నుంచి ఆందోళన వ్యక్తం కావడమే ఇందుకు కారణం.

ఇవీ చదివింది..

Covid-19: కరోనా వచ్చినప్పుడు వాసన కోల్పోయారా.. వాటి డ్యామేజ్ వల్లేనేనంటున్న పరిశోధనలు..

Economic crisis: దేశంలోని ఆ రాష్ట్రాల్లో శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం.. ప్రధానికి అధికారులు వెల్లడి.. ఎందుకంటే..