World Bank Report: దేశంలో గణనీయంగా తగ్గిన పేదరికం.. వారి ఆదాయం మాత్రం ఏటా 10% పెరిగింది..

World Bank Report: భారత్ లో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందని ప్రపంచ బ్యాంకు పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉందని వెల్లడించింది.

World Bank Report: దేశంలో గణనీయంగా తగ్గిన పేదరికం.. వారి ఆదాయం మాత్రం ఏటా 10% పెరిగింది..
Poverty
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 18, 2022 | 7:37 AM

World Bank Report: భారత్ లో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందని ప్రపంచ బ్యాంకు పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ తెలిపింది. దేశంలో అత్యంత పేదరికం 2011 కంటే 2019లో 12.3 శాతం తగ్గింది. 2011లో 22.5 శాతం మంది పేదరికంలో ఉండేవారని.. ఆ సంఖ్య 2019 నాటికి 10.2 శాతానికి తగ్గిందని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం బాగా తగ్గినట్లు పేర్కొంది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. భారత్ తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని IMF వర్కింగ్ పేపర్ వెల్లడించింది. ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలను అందజేస్తుండటంతో వినియోగంలో అసమానతలు  40 ఏళ్ల కాలంలో కనిష్ఠ స్థాయికి తగ్గినట్లు వివరించింది.

ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హ రాయ్, రాయ్ వాన్ డెర్ వెయిడే రూపొందించిన ప్రపంచ బ్యాంకు వర్కింగ్ పేపర్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. భారత దేశంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉంది. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 26.3 శాతం ఉండేది.. కానీ 2019లో అది 11.6 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 2011లో 14.2 శాతం పేదరికం ఉండగా.. 2019 నాటికి అది 6.3 శాతానికి తగ్గిపోయింది. గత దశాబ్దంలో దేశంలో పేదరికం తగ్గినప్పటికీ.. అది అనుకున్న స్థాయిలో తగ్గలేదని ఈ నివేదిక తెలిపింది. అభివృద్ధిపై ఆలోచనలను పంచుకోవడాన్ని ప్రోత్సహించడం, జరుగుతున్న పరిశోధనలలో తెలుసుకున్న విషయాలను వ్యాపింపజేయడం లక్ష్యంగా ఈ పేపర్లను రూపొందించారు. తక్కువ విస్తీర్ణం భూమి కలిగిన వారి ఆదాయం ఎక్కువగా వృద్ధి చెందినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. 2013, 2019 మధ్య కాలంలో ఏటా 10 శాతం చొప్పున వీరి ఆదాయం పెరిగినట్లు తెలిసింది. ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్నవారి ఆదాయం ఏటా 2 శాతం మాత్రమే పెరిగినట్లు పరిశోధనలు వెల్లడైంది.

ఇవీ చదవండి..

India-China Border Issue: భారత సరిహద్దుల్లో మళ్లీ డ్రాగన్ దూకుడు.. దేశ భద్రతకు పెరుగుతున్న ముప్పు..!

AP News: రెండు నెలలు చేపల వేట నిషేధం.. అతిక్రమిస్తే ప్రభుత్వ పథకాలు బంద్.. ఎందుకంటే..

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్