India-China Border Issue: భారత సరిహద్దుల్లో మళ్లీ డ్రాగన్ దూకుడు.. దేశ భద్రతకు పెరుగుతున్న ముప్పు..!

India-China Border Dispute: చైనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. సరిహద్దు వద్ద వాస్తవాధీన రేఖ(Line of actual control) వద్ద వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. తాజాగా.. పాంగాంగ్‌ సరస్సుపై చేపట్టిన అక్రమ వంతెన నిర్మాణం(Bridge) తుది దశకు చేరింది. దీనికి తోడు మూడు మొబైల్‌ టవర్లను ఎల్‌ఏసీ వద్ద ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని చుషూల్‌ కౌన్సిలర్‌ కొంచెక్‌ స్టాంజిన్‌ వెల్లడించారు. “చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సుపై వంతెన నిర్మాణం పూర్తి చేశాయి. […]

India-China Border Issue: భారత సరిహద్దుల్లో మళ్లీ డ్రాగన్ దూకుడు.. దేశ భద్రతకు పెరుగుతున్న ముప్పు..!
India China Border
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 18, 2022 | 7:07 AM

India-China Border Dispute: చైనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. సరిహద్దు వద్ద వాస్తవాధీన రేఖ(Line of actual control) వద్ద వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. తాజాగా.. పాంగాంగ్‌ సరస్సుపై చేపట్టిన అక్రమ వంతెన నిర్మాణం(Bridge) తుది దశకు చేరింది. దీనికి తోడు మూడు మొబైల్‌ టవర్లను ఎల్‌ఏసీ వద్ద ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని చుషూల్‌ కౌన్సిలర్‌ కొంచెక్‌ స్టాంజిన్‌ వెల్లడించారు. “చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సుపై వంతెన నిర్మాణం పూర్తి చేశాయి. ఆ తర్వాత హాట్‌స్ప్రింగ్స్ వద్ద మూడు మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేశాయి. ఇవి భారత్‌ భూభాగానికి చాలా సమీపంలో ఉన్నాయి. ఇది ఆందోళనకరమైన అంశం కాదా..? ఇక్కడ మాకు కనీసం 4జీ సౌకర్యాలు కూడా లేవు. నా పరిధిలోని 11 గ్రామాలకు ఇప్పటికీ 4జీ ఇంటర్నెట్ సౌకర్యం లేదు” అంటూ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ లద్ధాఖ్‌ సమీపంలోని చైనా ఆక్రమణలను ఏ మాత్రం అంగీకరించబోమని వెల్లడించారు. పాంగాంగ్‌ వద్ద వంతెన నిర్మిస్తున్న ప్రాంతం 1962 నుంచి చైనా ఆక్రమణలో ఉందని ఆయన తెలిపారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ “వారు ఏం చేశారో .. మేము ఏం నిర్ణయాలు తీసుకొన్నామో చెప్పను. కానీ.. భారత్‌ ఎటువంటి నష్టాన్ని సహించదన్న సందేశం చైనాకు చేరింది” అని వ్యాఖ్యానించారు. 2020 మే నెలలో భారత్‌-చైనా మధ్య తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతంలో ఘర్షణలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌-చైనాలు సైనిక కమాండర్ల స్థాయిలో 15 సార్లు చర్చలు జరిపాయి. కానీ.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. ఇరు దేశాల సైనిక పహారా ఆ ప్రాంతంలో అలాగే కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇంకా చల్లారక ముందే చైనా దూకుడు పెంచి కొత్త నిర్మాణాలు చేపట్టడం భారత భద్రతకు ముప్పేనని నిపుణులు అంటున్నారు. రానున్న కాలంలో చైనా తన సైన్యం కోసం ఈ ప్రాంతంలో చేసే నిర్మాణాలు మరింతగా ఉండనున్నాయి. దీనిపై సైన్యం సైతం అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి చదవండి..

AP News: రెండు నెలలు చేపల వేట నిషేధం.. అతిక్రమిస్తే ప్రభుత్వ పథకాలు బంద్.. ఎందుకంటే..

Stock Market: స్టాక్‌ మార్కెట్‌ నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్న ఎఫ్‌పీఐలు..