AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Economic crisis: దేశంలోని ఆ రాష్ట్రాల్లో శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం.. ప్రధానికి అధికారులు వెల్లడి.. ఎందుకంటే..

Economic crisis: దేశంలోని కొన్ని రాష్ట్రాలు పాటిస్తున్న పద్ధతులు కారణంగా త్వరలోనే అవి శ్రీలంక(Srilanka Crisis) లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనపై ఇప్పటికే ప్రధానికి నివేదించారు.

Economic crisis: దేశంలోని ఆ రాష్ట్రాల్లో శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం.. ప్రధానికి అధికారులు వెల్లడి.. ఎందుకంటే..
Financial Crisis
Ayyappa Mamidi
|

Updated on: Apr 18, 2022 | 8:18 AM

Share

Economic crisis: దేశంలోని కొన్ని రాష్ట్రాలు పాటిస్తున్న పద్ధతులు కారణంగా త్వరలోనే అవి శ్రీలంక(Srilanka Crisis) లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్ ఈ ముప్పుకు దగ్గరగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 4న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో లేవనెత్తిన అనేక ఆందోళనలలో, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం హైలైట్ గా చర్చలోకి వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఉచితాలను నిలిపివేసి.. తమ ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించుకోకుంటే కొన్ని భారతీయ రాష్ట్రాలు శ్రీలంక బాటలోనే పయనించవచ్చని అధికారులు ప్రధానికి తెలిపారు. దీని నుంచి బయట పడాలంటే రాష్ట్రాలు తాము అందిస్తున్న ఉచిత పథకాలను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాల ఆర్ఠిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రాల అప్పులు వాటి జీడీపీలో 20 శాతానికి మించి ఉండకూడదని 2017లో కేంద్రానికి చెందిన ఆర్థిక రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ నిర్వహణ ప్యానెల్ తెలిపింది. కానీ దీనిని అతిక్రమిస్తూ.. జమ్మూ కశ్మీర్ అత్యధికంగా 56.6 శాతం, పంజాబ్ 53.3 శాతం, పశ్చిమ బెంగాల్ 38.8 శాతం అప్పుల వల్ల శ్రీలంక లాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నాయి. మరో పక్క గుజరాత్ 21.4 శాతం, మహారాష్ట్ర 20.4 శాతం అప్పులు కలిగి ఉన్నాయి. ప్రతి మహిళకు నెలకు రూ. 1000, ఉచితంగా 300 యూనిట్ల కరెంటు అమలు వల్ల పంజాబ్ ఏటా 17 వేల కోట్లు వెచ్చిస్తోంది.

మరోపక్క పశ్చిమ బెంగాల్ లో ఉచిత పథకాలు, అగ్రీ పథకాలు మరింత భారంగా మారుతున్నాయి. పదేళ్ల మమత పాలనలో అప్పులు 205 శాతం పెరిగి.. రూ. 5.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే మసయంలో బిహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు సైతం దయనీయంగా ఉన్నాయి. వీటిపై ప్రధాని స్థాయిలో చర్చ జరగటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

జీడీపీలో రాష్ట్రాల అప్పుల శాతం..

జీడీపీలో రాష్ట్రాల అప్పుల శాతం..

ఇవీ చదవండి..

World Bank Report: దేశంలో గణనీయంగా తగ్గిన పేదరికం.. వారి ఆదాయం మాత్రం ఏటా 10% పెరిగింది..

India-China Border Issue: భారత సరిహద్దుల్లో మళ్లీ డ్రాగన్ దూకుడు.. దేశ భద్రతకు పెరుగుతున్న ముప్పు..!